పటాస్ సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని అందుకుని దర్శకుడిగా నిలదొక్కుకున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమలో అప్పటివరకు రానటువంటి కథాంశంతో వచ్చి ప్రేక్షకులను తొలి సినిమాతోనే ఈ స్థాయిలో అలరించాడు. అలా త్వరలోనే ఈ దర్శకుడు మంచి దర్శకుడు గా మారుతాడు అనే విషయాన్ని కొంతమంది హీరోలు గ్రహించి ఆయనకు వరుస సినిమా అవకాశాలు ఇవ్వడం మొదలుపెట్టారు. రవితేజ ఆయనకు తదుపరి సినిమా అవకాశాన్ని ఇవ్వగా అది కూడా సూపర్ హిట్ చేశాడు. మహేష్ తో చేసిన సరిలేరు నీకెవ్వరు సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. 

అలా చేసిన ప్రతి సినిమాతో భారీ విజయాన్ని అందుకొని అగ్ర దర్శకుడిగా ఎదిగాడు. ప్రస్తుతం ఎఫ్ 3 సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాడు. ఆయన గతంలో దర్శకత్వం వహించిన ఎఫ్2 సినిమా ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఆ సినిమాకి కొనసాగింపుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం కూడా భారీ విజయాన్ని అందుకుంటుందని చిత్రబృందం భావిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ ప్రేక్షకులను భారీ స్థాయిలో అలరించింది.

సినిమా ఇంకా విడుదల కాకముందే అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాలకు సంబంధించిన వార్తలను చెబుతున్నారు. ఆయన తన తదుపరి సినిమా బాలకృష్ణ తో చేయబోతున్నాడనే వార్తలు మొదటినుంచి వినిపించ సాగాయి. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించిన వార్తలను ఎప్పుడూ కూడా ఖండించలేదు. దాంతో వీరిద్దరి కలయికలో సినిమా రావడం ఖాయం అని అనుకున్నారు. తాజాగా ఈ విషయమై మరొకసారి అంగీకరించాడు అనిల్. బాలకృష్ణ తో సినిమా చేయడం ఖాయం అని చెప్పాడు. అయితే అనూహ్యంగా ఎన్టీఆర్ తో కూడా సినిమా చేయబోతున్నాడు అనే విషయాన్ని వెల్లడించడం ఎంతో ఆసక్తిగా మారింది. మరి ఆ సినిమా ఎప్పుడు మొదలు పెడతాడో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: