టాలీవుడ్ సినిమా పరిశ్రమ 10 సంవత్సరాల క్రితం వేరు ఇప్పుడు వేరు అనే వ్యత్యాసం ఇప్పుడు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాలు తెరకెక్కించే విషయంలో ఆయన సినిమాలు చూసే విషయంలో ఆయన ప్రతి విషయంలోనూ ఎంతో మార్పు వచ్చింది. హీరోలంతా కలిసి ఆహ్లాదకరమైన వాతావరణంలో సినిమాలు చేస్తున్నారు. అంతేకాదు మల్టీస్టారర్ సినిమాలు చేస్తున్నారు. ఒకరి సినిమా వేడుకకు మరొక హీరో అతిథిగా వెళ్లి ఆ సినిమాను ఆశీర్వదిస్తున్నారు. అవసరమైతే గెస్ట్ పాత్రల్లో కూడా నటిస్తున్నారు.

అంతేకాకుండా వాయిస్ ఓవర్ లు కూడా ఇస్తూ తమలోని ఐక్యతను చాటి చెబుతున్నారు. ఆ విధంగా వారిలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పాలి. వారిలో మాత్రమే కాదు హీరోయిన్స్ లో కూడా ఎంతో మార్పు వచ్చిందని ఇప్పుడు కనిపిస్తున్న కొన్ని పరిస్థితులను బట్టి తెలుస్తుంది. గతంలో అందం అనేది ఒకటే పరిగణలోకి తీసుకునే వారు కానీ ఇప్పుడు అందం కాకుండా అభినయం ఉంటే చాలు తమ సినిమాలలో పెట్టుకునేందుకు మేకర్స్ అసక్తి చూపుతున్నారు. ఆ విధంగా తమను తాము హీరోయిన్స్ ఎంతగానో ఉన్నతంగా మలచుకున్నారని చెప్పాలి.

ఎలాంటి పాత్రనైనా పోషించడానికి వారు సిద్ధం గా ఉన్నారు. తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు కథానాయికలు. అయితే గతంలో పెద్ద హీరోయిన్లు ఎవరు కూడా పెద్ద హీరోలతో హీరోయిన్ పాత్రలో కాకుండా వేరే పాత్రలో నటించేందుకు ఒప్పుకునేవారు కాదు కానీ ఇటీవల హీరోయిన్లు మాత్రం పెద్ద హీరోలతో గర్ల్ ఫ్రెండ్ గా నటిస్తూనే సిస్టర్ పాత్రకు కూడా నటించడానికి సిద్ధమైపోతున్నారు అందరు కూడా ఈ విధంగా ఆలోచిస్తూ నిజంగా మంచి ఈ పరిణామం అని చెప్పవచ్చు. మరి భవిష్యత్ లో ఈ హీరోయిన్ లు ఇంకా ఎలాంటి పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తాడో చూడాలి. ఈ రోజుల్లో అందరు కూడా అందాన్ని హైలైట్ చేసే విధంగా కాకుండా పాత్ర ను హైలైట్ చేసే విధంగా సినిమాలు చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: