నందమూరి బాలకృష్ణ గత ఏడాది అఖండ సినిమాతో సాధించిన సక్సెస్ గురించి ఇప్పటికీ ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుకుంటున్నారు. గత ఏడాది డిసెంబర్ లో విడుదలైన ఈ చిత్రం దర్శకుడు బోయపాటి శ్రీను మరియు నందమూరి బాలకృష్ణ కు బాగా కలిసి వచ్చిందని చెప్పాలి. ఆ సినిమా తర్వాత నందమూరి బాలకృష్ణ చేస్తున్న సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. ఈ సినిమాతో ఫాం లోకి వచ్చిన దర్శకుడు గోపీచంద్ మలినేని తన 107 సినిమా ను మొదలు పెట్టాడు.

శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా పక్కా మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా నిర్మిస్తుండగా విలన్ పాత్రలో కన్నడ నటుడు దునియా విజయ్ నటిస్తున్నారు. అలాగే ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అదేమిటంటే గోపీచంద్ మలినేని ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక మార్పులు చేయబోతున్నారట. కొత్తగా రెండు మాస్ సీన్స్ యాడ్ చేయబోతున్నారట. హిందూ ధర్మాన్ని ఎలివేట్ చేసే విధంగా ఆ రెండూ సీన్స్ ఉంటాయని చెబుతున్నారు.

బాలకృష్ణ ప్రతి సినిమాలోనూ డివోషనల్ టచ్ ఉండడంతో ఈ సినిమాలో కూడా ఆ సన్నివేశాలు పెడితే సెంటిమెంటల్ గా సినిమా సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పడంతో గోపీచంద్ మలినేని ఈ విధమైన మార్పులు చేస్తున్నారట. మరి ఈ రెండు సీన్లు ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడతాయో చూడాలి. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకి తమన్ సంగీతం సమకూరుస్తున్నగా ఈ చిత్రంలో బాలకృష్ణ ద్విపాత్రాభినయంలో కనిపించబోతున్నారని అంటున్నారు. మరి అయన ఇలా చేసిన సినిమాలు అన్నీ కూడా సూపర్ హిట్ అయిన వేళా ఈ సినిమా ఏ స్థాయి లో విజయాన్ని అందుకుంటాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: