గబ్బర్ సింగ్ లాంటి సూపర్ హిట్ సినిమా చేసిన తర్వాత కూడా హరీష్ శంకర్ కి ఎందుకో సినిమా ఆఫర్లు ఆయన ఇమేజ్ కు తగ్గట్టుగా రాలేదనే చెప్పాలి. ఆ చిత్రం తర్వాత చేసిన రామయ్యా వస్తావయ్యా చిత్రం ప్రేక్షకులను నిరాశ పరచడంతో హరీష్ శంకర్ ఇన్ని రోజులు సంపాదించుకున్న క్రేజ్ పోయింది. దాంతో ఆయనకు తప్పకుం డా హిట్ రావాల్సిన అవసరం ఏర్పడగా ఆ తర్వాత చేసిన సినిమాలు సక్సెస్ అయ్యి ఆయనకు మంచి పేరును తీసుకువచ్చాయి. అయితే అవి మీడియం రేంజ్ హీరోల సినిమా లే కావడం తో హరీష్ శంకర్ కు దక్కాల్సిన గౌరవం దక్కలేదనే చెప్పాలి.

కారణం ఏదైనా కూడా తనలోని టాలెంట్ ను పెద్ద హీరోలతో పంచుకొని సినిమాలు చేసి స్టార్ దర్శకుడిగా మారడం లో హరీష్ శంకర్ విఫలం అయ్యాడు. ఇప్పుడు మళ్లీ పవన్ కళ్యాణ్ తో ఆ విధమైన స్టార్ డం తెచ్చుకోవాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆ విధంగా భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్న హరీష్ శంకర్సినిమా ను ఇంకా మొదలు పెట్టకపోవడం పై ఎంతో అసహనంగా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ సినిమాను అనౌన్స్ చేసి రెండు సంవత్సరాలు దాటిపోతున్నా కూడా పవన్ కళ్యాణ్సినిమా కోసం ఎటువంటి డేట్స్ కేటాయించక పోవడంతో ఆయనలో అసహనం ఇంకా ఇంకా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే పవన్ ఈ సినిమాకు వచ్చే సమయానికంటే ముందే మరొక సినిమా చేయాలని భావిస్తున్నాడు. అందుకే హిందీలో సక్సెస్ అయిన రైడ్ సినిమాను తెలుగులో కూడా చేయాలని ఆయన ముందుకు వచ్చాడు. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రానుంది. ఇందులో ఎవరు హీరోగా నటిస్తారు అనేది ఇంకా తెలియరాలేదు. దీనికి సంబంధించిన అన్ని వివరాలను చిత్ర బృందం వెల్లడించనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: