కొన్నెల్లుగా అల్లు అర్జున్ ఖాతాలో హిట్ లేదు..కొంత కాలం గ్యాప్ తీసుకొని చేసిన అల వైకుంఠపురంలో సినిమా తో భారీ హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత గ్యాప్ లేకుండా వచ్చిన పుష్ప సినిమా తో హ్యట్రీక్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.. ఆ సినిమా బన్నీ కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యింది. మొదటి పాన్ ఇండియా సినిమాగా విడుదల అయ్యి అన్నీ ప్రాంతాలలో ఘన విజయాన్ని అందుకున్నాడు.. ఇప్పుడు బన్నీ క్రేజ్ డబుల్ అయ్యింది. బాలివుడ్ లో అయితే ఆ సినిమాతో చాలా మంది బన్నీ ఫ్యాన్స్ అయ్యారు..


రంగస్థలం ఫెమ్ డైరెక్టర్ లెక్కల మాస్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా వచ్చిన విషయం తెలిసిందే.రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.కాగా, సినిమా భారీ సక్సెస్ కావడం తో సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 ను తెరకెక్కించాలని చిత్ర యూనిట్ ప్లాను చెస్తున్నారు.. అయితే సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు కానీ, సినిమా విడుదల తెదీని కూడా సుక్కు అనౌన్స్ చేశారు.దీనిపై సర్వత్రా సందెహాలు మొదలయ్యాయి.కానీ సుక్కు మాత్రం సినిమా విడుదల పై రాజీ పడేది లేదని అంటున్నారు. పుష్ప సీక్వెల్ లో అంతకు మించి, పాన్ ఇండియా ఆడియన్స్ ను సాటిస్ ఫై చేయాల్సిన బిగెస్ట్ చాలెంజ్ సుకుమార్ ముందుంది. దానికోసమే సుకుమార్ పుష్ప 2 స్ర్కిప్ట్ దశలోనే కావాల్సినంత టైమ్ తీసుకుని, మార్పులు చేర్పులు చేస్తున్నారు.


ఇక్కడుంటే అదర్ మూవీ మేకర్స్ సుకుమార్ ను చీఫ్ గెస్ట్ గా ఇన్వైట్ చేస్తూ డిస్ట్రబ్ చేస్తున్నారని యుఎస్ ఏ వెళ్లి స్క్కిప్ట్ మీద వర్క్ చేసి వచ్చారు సుకుమార్ అండ్ టీమ్. బన్నీతో డిస్కస్ చేసి ఫైనల్ వెర్షన్ లాక్ చేశాక మిగతా ప్రి ప్రొడక్షన్ పనులు ముందుకెళ్తాయి. అలాంటిది స్క్రిప్టే ఫైనల్ కాకుండా ఇంకా మిగతా విషయాలేవి చెప్పలేరు. కనుక ఇప్పటిదాకా పుష్ప 2 పైన వచ్చిన కథనాలన్నీ ఊహాగానాలే..ముందుగా అనుకున్న దానికన్నా కూడా గ్రాండ్ గా ఈ సినిమాను తెరకెక్కించాలని ప్లానింగ్ లో ఉన్నారు.పార్ట్ 2 కోసం దాదాపు 300 కోట్లకు పైగా బడ్జెట్ ఖర్చు చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ రెడీగా ఉన్నారు. పుష్ప విషయంలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంగారు కంగారుగా జరిగింది. ఈ సారి పక్కా ప్లానింగ్ తో నాలుగు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసమే కేటాయించాలని చూస్తున్నారు సుకుమార్ టీమ్..మొత్తానికి ఈ సినిమా కోసం సుక్కు బాగా కష్ట పడుతున్నారు.. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: