హిందీ సీరియల్స్ తో అలరిస్తున్న సోనారికా భడోరియా అంటే తెలియని వారు ఉండరు. సీరియల్స్ లో ఎక్కువగా నటించే ఈమె సినిమాలలో కూడా హీరోయిన్ గా నటించారు. అయితే ఈమె హిందీలో వచ్చే "దేవోన్ కి దేవ్ మహాదేవ్" సీరియల్లో "పార్వతీదేవి" పాత్రలో కనిపించిన సోనారికా భడోరియా "పృథ్వీ వల్లభ: ఇతిహాస్ భీ రహస్య భీ", మరియు "దాస్తాన్ ఏ మొహబ్బతే: సలీం అనార్కలి సీరియల్స్" లో కూడా నటించి బుల్లితెర మీద తన కంటూ ఒక మంచి పేరు సంపాదించుకుంది. అయితే ఈ అమ్మడు హిందీ సీరియల్స్ తో మాత్రమే కాక తెలుగులో కూడా "జాదూగాడు" అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయింది. ఆతర్వాత "స్పీడున్నోడు" సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కూడా హీరోయిన్ గా కనిపించింది.

ఇక ఆ తర్వాత "ఈడోరకం ఆడోరకం" సినిమాతో తెలుగులో అనుకోని విధంగా మంచి హిట్ ను అందుకుంది ఈ భామ. అయితే ఇప్పుడు తాజాగా సోనారిక తన వ్యక్తిగత జీవితం వల్ల వార్తల్లో నిలిచింది. కాగా సోనారిక గత కొంతకాలంగా వికాస్ భరత్ అనే ఒక వ్యక్తితో రిలేషన్ షిప్ లోఉండనే విషయం అందరికి తెలిసిన సంగతి. అయితే  తాజాగా బుధవారం నాడు తన బాయ్ ఫ్రెండ్ పుట్టిన రోజు సందర్భంగా వారు బీచ్ దగ్గర చాలా రొమాంటిక్ గా దిగిన పలు అందమైన ఫోటోలను సోషల్ మీడియా వేదిక షేర్ చేస్తూ "బంగారం లాంటి మనసున్న అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.

ఆంతేకాదు నువ్వు ఎప్పుడూ నా మనసుని, సోల్ ని, మైండ్ ని కూడా బాగా కేర్ చేస్తావు. అంతేకాకుండా నా సేఫ్ ప్లేస్ నువ్వే నా అతిపెద్ద అడ్వెంచర్ కూడా నువ్వే, అలాగే నువ్వు ఎప్పుడూ నన్ను ఒక సాఫ్ట్ మరియు మంచి మనిషిగా మారుస్తూ ఉంటావు, మరియు ఎప్పుడూ నాకు అండగా నిలుస్తూ నా పక్కనే ఉంటావు. ఇక నా కోసం అయితే నీ గుండెల్లో ఏకంగా ఒక ఇల్లే  కట్టుకున్నావు ఐ యామ్ సో  హ్యాపీ. హ్యాపీ  బర్త్డేటూ యు " అని తన కాబోయే భర్త గురించి సోనారికా భడోరియా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: