మెగాస్టార్ చిరంజీవి ఇంకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆచార్య' సినిమా సినిమా థియేటర్లలో విడుదలై పెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.ఇక నిన్న రాత్రి నుంచి ఓటీటీలో 'ఆచార్య' సినిమా స్ట్రీమింగ్ అవుతుండగా, 'ఆచార్య' సినిమాకి 'ఆర్ఆర్ఆర్' రూపంలో గట్టి పోటీ ఎదురయ్యింది.చిత్రమేంటంటే, 'ఆర్ఆర్ఆర్' సినిమా సంగతి పక్కన పెట్టి, ఎక్కువమంది మెగా అభిమానులు 'ఆచార్య'సినిమానే ముందుగా చూసేశారు. 'ఆచార్య' సినిమా సినిమా బావుందనీ, అనవసరంగా దాన్ని కొందరు కుట్ర పూరితంగా తొక్కేశారనీ వారు ఆరోపించారు. ఆ ఆవేదనా ప్రవాహం ఈ రోజంతా కూడా కొనసాగింది. అయితే, 'ఆచార్య' సినిమా కాస్సేపు స్టార్ట్ చేసి, ఆ తర్వాత ఆటోమేటిక్‌గా అందరూ కూడా 'ఆర్ఆర్ఆర్' సినిమా వైపు వెళ్ళిపోయారు.ఇక కామన్ ఆడియన్స్.. అంటే సాధారణ సినీ అభిమానులు మాత్రం 'ఆర్ఆర్ఆర్' సినిమాని చూసేందుకే మొగ్గు చూపారు.


'ఆర్ఆర్ఆర్' తరువాత , 'ఆచార్య'ని చూసినవాళ్ళూ లేకపోలేదు. స్ట్రీమింగ్ గంటల విషయమై రెండు మూడు రోజుల్లో పూర్తి క్లారిటీ అనేది వచ్చే అవకాశముంది.కాగా, 'భీమ్లానాయక్' సినిమా టెలివిజన్ ప్రీమియర్‌కి పూర్ రేటింగ్స్ వచ్చిన సంగతి తెలిసిందే.అక్కడ 'భీమ్లానాయక్' సినిమా చతికిలపడితే, ఇక్కడ 'ఆచార్య' సినిమా చతికిలపడిందంటూ కొందరు మెగా పవర్ ట్రోలింగ్‌కి దిగారు. వారికి కౌంటర్ ఎటాక్ ఇవ్వలేక మెగా అభిమానులు పడ్డ పాట్లు అసలు అన్నీ ఇన్నీ కావు.ఇక కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన 'ఆచార్య' సినిమా, మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లోనే అతి పెద్దగా డిజాస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే.పైగా ఈ సినిమాలో ఆర్ ఆర్ ఆర్ తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఉండటంతో ఈ సినిమా సరికొత్త రికార్డులు నమోదు చేసి హిట్ అవుతుందని భావించారు. కానీ సినిమా చాలా నిరాశపరిచింది. ఈ సినిమా చేసిన గాయం బహుశా మెగా ఫ్యాన్స్ ఇక జీవితంలో మరిచిపోలేరేమో!


మరింత సమాచారం తెలుసుకోండి: