బాలీవుడ్ హీరోయిన్, ముక్కుసూటి నటి ఎవరంటే కంగనా రనౌత్ అని చెప్పవచ్చు. ఇటీవల కాలంలో సెన్సేషనల్ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటోంది ఈమె. తాజాగా కంగనా రనౌత్ నటించిన ధాకడ్ తో ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ చిత్రాన్ని చూడటానికి అభిమానులు సైతం క్యూ కడుతున్నారు. ఇక ఇలాంటి సమయంలోనే కంగనా రనౌత్ కొత్త కారు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. కంపెనీ ప్రతినిధులు ఆమెకు కారు తాళాలు కూడా అందజేయడం జరిగింది.


కంగనా రనౌత్ ఏ కారు కొన్న ధర దాదాపు రూ.5 కోట్ల రూపాయలకు పైగా ఉంటుంది. ఇది మెర్సిడెస్ మే బాక్ ఎస్-680 మోడల్ గల కారణం తీసుకుంది.ధాకడ్ సినిమా ప్రీమియర్ షోకి ఈ కారు తిసుకొని తన కుటుంబ సభ్యులతో విచ్చేసింది. కొత్త కారుకు కంగన తల్లి పూజ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. దీంతో కంగనా కొన్న కొత్త కారు సంబంధించిన ఫోటోలు మాధ్యమికలలో  వైరల్ గా మారుతూనే ఉన్నాయి. ఇక తన కుటుంబ సభ్యులతో కలిసి దిగిన కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి. కంగనా రనౌత్ బ్లాక్ ప్రింటర్ డ్రెస్సులో మెరిసిపోతూ కనిపిస్తోంది.


తను  పార్కు చేసిన కారు పక్కనే కంగనా కనిపిస్తోంది.. ఇక మరొక వీడియోలో కంగనా తల్లి కారుకు పూజలు చేస్తున్నట్లుగా కూడా కనిపిస్తోంది. కంగనా రనౌత్ కొన్న మొదటి కారు..BMW -7 సిరీస్ కేవలం 21 సంవత్సరాల వయసులోనే ఈమె తీసుకున్నట్లు తెలుస్తోంది. అంటే 2008వ సంవత్సరంలో ఈ కారు ను తీసుకుంది. బాలీవుడ్ లో అత్యధికంగా సంపన్నుల నటీనటులలో కంగనారనౌత్ పేరు కూడా ఉందని చెప్పవచ్చు. కంగనా రనౌత్ కఠోర శ్రమతో కొన్ని కోట్ల రూపాయల ఆస్తి ని సంపాదించుకున్నది. ఇక ఈమె ఆస్తి విషయానికి వస్తే ఈమెకు మూడు ఇల్లు ఉన్నాయి. ముంబైలో కూడ ఒక బిల్డింగ్ నివసిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: