తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ కమెడియన్ గా పేరు పొందింది సీనియర్ హాస్యనటి కోవైసరళ. తెలుగుతో పాటు తమిళంలో కూడా సినిమాలలో నటించి తనదైన మార్కుతో ఆకట్టుకుంది. 2019వ సంవత్సరంలో అభినేత్రి-2 చిత్రంతో తెలుగు ప్రేక్షకులను తిరిగి పలకరించింది. ప్రస్తుతం కోవై సరళ నటిస్తున్న తమిళ చిత్రం సెంబి. ఇందులో ఈమె సరికొత్త మేక్ ఓవర్ తో ఎవరు గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.

విభిన్నమైన దర్శకులలో పేరుపొందిన ప్రభు సాల్మన్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శుక్రవారం రోజునే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా విడుదల చేయడం జరిగింది. ఇక కోవై సరళ సరికొత్త లుక్  లో కనిపించి ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. డైరెక్టర్ ప్రభు సల్మాన్ ఇటీవల దగ్గుబాటి రానా హీరోగా నటించిన ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ చిత్రం అయిదు భాషల్లో విడుదలై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇక ఈ చిత్రం తర్వాత కాస్త విరామం తీసుకున్న ప్రభు సాల్మన్ సరికొత్త కథ నేపథ్యంతో సేంబి చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో కోవైసరళ సీరియస్ పాత్రలో కనిపించబోతున్నట్లూ గా కనిపిస్తోంది. సేంబి ఓ బస్ జర్ని నేపథ్యంలో సాగే సినిమా గా కనిపిస్తోంది. కొంత మంది ప్రయాణికులు కొడైకెనాల్ టు దిండిగల్ ట్రావెలింగ్ కోసం ఒక బస్సులో ప్రయాణాన్ని మొదలు పెట్టినట్లు కనిపిస్తోంది. అలా ప్రయాణిస్తున్న సమయంలో వారికి ఎదురైన ఎన్నో సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించడం జరిగిందట. విభిన్నమైన రోడ్ జర్నీ చిత్రంగా ఈ సినిమా రూపొందించడం జరుగుతోంది. ఇక ఈ సినిమా ఇదే పేరుతో తెలుగులో కూడా విడుదల చేయబోతున్నారు చిత్రబృందం. ఏ సినిమా లోని డి గ్లామరస్ పాత్రలో నటిస్తున్నది కోవై సరళ. ఇక ఈమె పాత్ర ఈ సినిమాలో చాలా విభిన్నంగా ఉండబోతోందని అన్నట్లుగా తెలుస్తోంది. ఇక మిగతా పాత్రలలో తంబి రామయ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా నీలా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: