తెలుగు చిత్ర పరిశ్రమలో బోయపాటి సినిమాలకు ఒక లెక్క ఉంటుంది. కేవలం మాస్ సినిమాలకు మాత్రమే ఆయన పెట్టింది పేరు..ఎందరో హీరోల తో ఊర మాస్ డైలాగులను చెప్పించాడు. ఎక్కువగా బాలయ్య తో నటించిన సినిమాలు అన్నీ కూడా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నాయి. మొన్నీమధ్య వచ్చిన అఖండ మూవీ బాక్సాఫిస్  రికార్దులను బ్రేక్ చేసింది.ఈ సినిమాతో నందమూరి బాలకృష్ణ చాలా రోజుల తరువాత తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. పూర్తిగా మాస్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన అఖండ చిత్రంలో బాలయ్య పర్ఫార్మెన్స్ పీక్స్‌లో ఉండటంతో ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఫలితంగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచింది.


ఘన విజయాన్ని అందుకోవడం మాత్రమే కాదు 125 కోట్లకు పైగా వసూల్లను కూడా అందుకుంది.బాలయ్య కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిచింది.ఈ సినిమాకు సీక్వెల్ ఉంటుందని దర్శకుడు బోయపాటి అఖండ చిత్ర క్లైమాక్స్‌లోనే ఓ క్లూ వదిలిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా పలు ఇంటర్వ్యూల్లో బోయపాటి ఇదే విషయాన్ని చెప్పుకువచ్చాడు. కానీ బాలయ్యతో ఆయన చేయబోయే నెక్ట్స్ మూవీ ఓ పొలిటికల్ సబ్జెక్ట్‌గా రాబోతుందనే వార్త ఇండస్ట్రీ వర్గాల్లో గతకొంత కాలంగా వినిపిస్తూ వస్తోంది. రాబోయే ఎన్నికల కోసం బోయపాటి ఓ పవర్‌ఫుల్ పొలిటికల్ డ్రామా మూవీని బాలయ్యతో తెరకెక్కించాలని చూస్తున్నట్లు వార్తలు వినిపించాయి.బాలయ్యతో ఆయన చేయబోయేది ఖచ్చితంగా అఖండ చిత్రానికి సీక్వెల్ అని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే అఖండ సీక్వెల్ మూవీ కోసం బోయపాటి స్క్రిప్టు పనులు మొదలుపెట్టారని, త్వరలోనే ఈ సినిమా కథను పూర్తిగా రెడీ చేసి బాలయ్యకు వినిపించాలని ఆయన భావిస్తున్నాడట. అయితే అఖండ అందించిన హిట్‌తో ఈసారి సీక్వెల్ మూవీని ఏకంగా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని బోయపాటి బడా ప్లాన్ వేస్తున్నాడట..ఇక నిర్మాత కూడా ఈ సినిమా సీక్వెల్ పై ఆసక్తి చూపిస్తున్నారు. మరి బోయపాటి సీక్వెల్ ను చేస్తున్నారా? లేదా ?తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే..


మరింత సమాచారం తెలుసుకోండి: