సినిమా ఇండస్ట్రీలో కి ఎంతో మంది హీరోయిన్లు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ కొంతమంది మాత్రమే చాలా సంవత్సరాల పాటు తమ హవాను సినిమా ఇండస్ట్రీలో కొనసాగిస్తూ ఉంటారు. అలా  సినిమా ఇండస్ట్రీలో కి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే ఫుల్ క్రేజ్ ను సంపాదించుకొని,  ఆ తర్వాత స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకొని, ఎన్నో సంవత్సరాల పాటు ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా కొనసాగి ప్రస్తుతం కూడా కుర్ర హీరోయిన్లకు పోటీగా వరుస అవకాశాలను దక్కించుకుంటున్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. తమన్నా తెలుగు, తమిళ, హిందీ భాషల మూవీ లలో నటించి ఫుల్ క్రేజ్ ని సంపాదించుకుంది.

కాకపోతే తమన్నా తెలుగు, తమిళ, హిందీ భాషల సినిమాల్లో నటించినప్పటికీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో మాత్రం తమన్నా  టాప్ హీరోయిన్ లలో ఒకరిగా చాలా సంవత్సరాల పాటు కొనసాగింది. అది మాత్రమే కాకుండా  తమన్నా టాలీవుడ్ ఇండస్ట్రీ లోని దాదాపు అందరు స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకులను మెప్పించింది. ఇలా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాల పాటు స్టార్ హీరోయిన్ గా తన హవాను చూపించిన మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ఫుల్ స్పీడ్ లో దూసుకుపోతుంది. ఇప్పటికే తమన్నా  కొన్ని రోజుల క్రితం విడుదల అయిన గని మూవీ లో స్పెషల్ సాంగ్ లో నటించింది.

ఈ స్పెషల్ సాంగ్ లో మిల్కీ బ్యూటీ తమన్నా తన అందచందాలతో ప్రేక్షకులను ఫిదా చేసింది. గని మూవీ బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినా,  తమన్నా మాత్రం తన స్పెషల్ సాంగ్ తో ప్రేక్షకులను అదిరిపోయే రేంజ్ లో అలరించింది.  ఇలా ఇప్పటికే ఈ సంవత్సరం గని మూవీ లోని స్పెషల్ సాంగ్ తో  ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మిల్కీ బ్యూటీ తమన్నా మరి కొన్ని రోజుల్లో ఎఫ్ 3  సినిమాతో ప్రేక్షకులను అలరించబోతోంది. తమన్నా తాజాగా నటించిన ఎఫ్ 3 సినిమా మే 27 వ తేదీన థియేటర్ లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా కామెడీ ప్రాధాన్యత కలిగిన సినిమాగా తెరకెక్కింది.  ఈ సినిమాతో పాటు తమన్నా ప్రస్తుతం  భోళా శంకర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇలా మిల్కీ బ్యూటీ తమన్నా కుర్ర హీరోయిన్ లకు ఏ మాత్రం తీసిపోకుండా వరుస అవకాశాలను తెలుగు సినిమా ఇండస్ట్రీలో దక్కించుకుంటూ ఫుల్ హవాను టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికి చూపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: