ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కామెడీ సినిమాలు చాలా తక్కువగా వస్తున్నాయి. అందులోనూ స్టార్ హీరోలు కమర్షియల్ సినిమాలలో నటించడానికి ఇస్తున్న ప్రాముఖ్యతను కామెడీ సినిమాల్లో నటించడానికి ఇవ్వకపోవడంతో కామెడీ సినిమాల సంఖ్య కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో రోజు రోజుకు తగ్గిపోతూ వస్తోంది. కాకపోతే ప్రేక్షకులు మాత్రం కామెడీ సినిమాలను చూడడానికి చాలా ఆసక్తిని చూపిస్తున్నారు. అందులో భాగంగా ఏదైనా సినిమా ఫుల్ లెంత్ కామెడీ మూవీ గా తెరకెక్కి బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ను కనుక తెచ్చుకున్నట్లు అయితే ఆ సినిమాలకు కలెక్షన్లు కూడా విపరీతంగా వస్తున్నాయి. 

అందుకు ఉదాహరణ కొంత కాలం క్రితం విడుదలైన జాతి రత్నాలు.  మామూలు నటీ నటులు నటించిన జాతి రత్నాలు సినిమా కామెడీ ప్రధాన ఆధారంగా తెరకెక్కింది.  ఈ సినిమాకు విడుదలైన మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఎఫ్ 2  సినిమా కూడా కామెడీ ప్రధాన ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాకు  కూడా బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్లు వచ్చాయి.  ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా ఎఫ్ 3 సినిమాను తెరకెక్కించారు.  

దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీ ని కూడా ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కించినట్లు అనేక సందర్భాల్లో తెలియజేశాడు.  కామెడీ ఎంటర్టైనర్ ఎఫ్ 3 సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోగా నటించగా తమన్నా, మెహరీన్  హీరోయిన్ లుగా  నటించారు. ఎఫ్ 3 సినిమా మే 27 వ తేదీన విడుదల కాబోతుంది.  ఇది ఇలా  ఉంటే ఈ సినిమా ఆస్ట్రేలియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో విడుదల కాబోతుంది.  ఎఫ్ 3 సినిమా ఆస్ట్రేలియాలో దాదాపు 50 ప్లస్ లొకేషన్లలో విడుదల కాబోతోంది. ఇలా ఈ సినిమాకు ఆస్ట్రేలియాలో కూడా ఫుల్ క్రేజ్ ఉండటంతో ఈ రేంజ్ థియేటర్ లను చిత్ర  బృందం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: