రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ నుండి సినిమా వస్తుంది అంటే అటు ఆయన ఫ్యాన్స్ లో మాత్రమే కాదు, ఆడియన్స్ అందరిలో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉంటాయి. ఆ విధంగా హీరోగా తన సినిమాలతో అందరి దృష్టిని ఆకర్షించి మంచి క్రేజ్ సొంతం చేసుకున్నారు ప్రభాస్. అయితే ఇటీవల ఆయన నటించిన రాధేశ్యామ్ మూవీ పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ప్రస్తుతం చేస్తున్న సినిమాలతో ఎలాగైనా ప్రేక్షకాభిమానులు అందరికీ మంచి కిక్ ఇచ్చేలా వాటిని సిద్ధం చేస్తున్నారట డార్లింగ్.

ఇక ప్రస్తుతం ప్రభాస్ ఆదిపురుష్ అనే మైథలాజికల్ మూవీ, ప్రశాంత్ నీల్ తో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్, అలానే నాగ అశ్విన్ తో ప్రాజెక్ట్ కె అనే భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇవి మూఢ ప్రస్తుతం వేగవంతంగా షూటింగ్స్ జరుపుకుంటున్నాయి. అయితే వీటిలో ముందుగా వచ్చే ఏడాది జనవరిలో ఆదిపురుష్, సమ్మర్ లో సలార్, అలానే ఆపైన ప్రాజెక్ట్ కె మూవీస్ విడుదల కానున్నాయి.

ఈ విధంగా డార్లింగ్ తన కెరీర్ ని ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ కొనసాగుతున్నారు. వాస్తవానికి ప్రభాస్ కెరీర్ పరంగా ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆనందముగా ఉన్నప్పటికీ ఒక్క విషయంలో మాత్రం వారికి నిరాశ తప్పడంలేదు. ప్రభాస్ పెళ్ళికి సంబంధించి గుడ్ న్యూస్ వినాలని వారు ఎప్పటినుండో ఆశగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాదండోయి అటు ఆడియన్స్ కూడా మన డార్లింగ్ ఎప్పుడు పెళ్లి శుభవార్త చెప్తారా అని ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రభాస్ కుటుంబసభ్యులు కూడా ఆయనకి పెళ్లి చేయాలనే ఆలోచనలో ఉన్నప్పటికీ ప్రస్తుతం కెరీర్ మంచి పీక్స్ లో ఉండడంతో మరికొంత సమయం తరువాతనే తన పెళ్లి గురించి ఆలోచన చేయాలని చూస్తున్నారట ప్రభాస్. మరి ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక ఎప్పుడు తీరుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: