పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో యువ దర్శకుడు హరీష్ శంకర్ తీసిన సినిమా గబ్బర్ సింగ్. సల్మాన్ ఖాన్ నటించిన హిందీ సూపర్ హిట్ మూవీ దబాంగ్ కి రీమేక్ గా తెరకెక్కిన గబ్బర్ సింగ్ ఇక్కడ ఎంత పెద్ద విజయం అందుకుందో అందరికీ తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే స్వాగ్, డైలాగ్స్, స్టైల్, ఫైట్స్, డ్యాన్స్ ఇలా అన్నింటా అందరినీ ఎంతో ఆకట్టుకున్న గబ్బర్ సింగ్ తో దర్శకుడుగా హరీష్ శంకర్ మంచి పేరు సొంతం చేసుకున్నారు.

అయితే ఆ తరువాత నుండి మరొక్కసారి పవన్ తో పని చేసే ఛాన్స్ కోసం ఎదురు చూడసాగారు హరీష్. మొత్తంగా దాదాపుగా పదేళ్ల తరువాత హరీష్, పవన్ ల కాంబినేషన్ లో లేటెస్ట్ గా భవదీయుడు భగత్ సింగ్ మూవీ సెట్ అయింది. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్ వారు ఎంతో భారీ స్థాయిలో నిర్మించనున్న ఈ మూవీ త్వరలో ప్రారంభం కానుంది.

కాగా అందరిలో మంచి హైప్ ఉన్న ఈ మూవీ గురించి నిన్న ఒక మీడియా ఇంటర్వ్యూ లో భాగంగా హరీష్ శంకర్ మాట్లాడుతూ, గబ్బర్ సింగ్ ని మించేలా మరింత అద్భుతంగా ఇందులో పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ ఉంటుందని, ముఖ్యంగా పవన్ ఇందులో ఎంతో స్టైలిష్ గా అందంగా కనిపిస్తారని, ఆయన నుండి ఫ్యాన్స్ ఆశించే అన్ని కమర్షియల్ అంశాలతో పాటు సాధారణ ఆడియన్స్ ని ఆకట్టుకునే ఎలెమెంట్స్ అన్ని జొప్పించి ఈ మూవీ కథ, కథనాలు సిద్ధం చేశాను అని అన్నారు. ఆగష్టు లో పట్టాలెక్కనున్న ఈ మూవీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కనుంది. మొత్తంగా హరీష్ శంకర్ చెప్పిన ఈ మాటలతో ఒక్కసారిగా భవదీయుడు భగత్ సింగ్ మూవీ పై అందరిలో విపరీతంగా అంచనాలు పెరిగాయి. మరి రేపు పట్టాలెక్కి ఆపైన విడుదల తరువాత ఈ మూవీ ఎంత మేర సక్సెస్ కొడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: