కన్నడ మూవీ గా మొదట తెరకెక్కి, ఆ తరువాత దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి సలహా ద్వారా దేశవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయి అన్ని భాషల్లో కూడా సంచలన విజయం సొంతం చేసుకున్న మూవీ కెజిఎఫ్ చాప్టర్ 1. యాష్, శ్రీనిధి శెట్టి హీరో, హీరోయిన్స్ గా నటించిన ఈ భారీ యాక్షన్, ఎమోషనల్ మాస్ ఎంటర్టైనర్ కి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా హోంబలె ఫిలిమ్స్ వారు దీనిని ఎంతో భారీ స్థాయిలో నిర్మించారు.

అందరి అంచనాలు అందుకుని పెద్ద సక్సెస్ కొట్టిన ఈ మూవీకి సీక్వెల్ గా ఇటీవల ప్రేక్షకులు ముందుకు వచ్చిన కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో రిలీజ్ అయి, మొదటి భాగాన్ని మించి మరింత గొప్ప విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాని కొనుగోలు చేసిన దాదాపుగా అనేక ప్రాంతాల బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్లకు ఈ మూవీ కాసుల పంటని కురిపించింది. వాస్తవానికి అటు హిందీలో ఈ సినిమా ఆల్మోస్ట్ మన బాహుబలి 2 కి కొద్దిపాటి చేరువన నిలిచింది అంటే, అక్కడి ఆడియన్స్ ఈ మూవీని ఎంతగా ఆదరించారో అర్ధం చేసుకోవచ్చు.

ఇక తెలుగు సహా పలు ఇతర భాషల్లో సైతం ఈ సినిమా భారీ స్థాయిలో కలెక్షన్స్ ని సొంతం చేసుకోవడం విశేషం. అలానే ఓవర్సీస్ లో కూడా బాగా రాబట్టిన కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ ఇటీవల ఏకంగా ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీ టోటల్ కలెక్షన్స్ ని దాటేసి ప్రస్తుతం అక్కడక్కడా ఒకింత పర్వాలేదనిపించే కలెక్షన్ సాగిస్తున్నట్లు టాక్. మరోవైపు ఈ మూవీ ఇప్పటికే ఓటిటి లో వచ్చినప్పటికీ కూడా అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో ప్రేక్షకులు మూవీని థియేటర్స్ లో చూస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు. కాగా మరికొద్దిరోజుల అనంతరం కెజిఎఫ్ చాప్టర్ 2 మూవీ టోటల్ గా ఎంత కలెక్షన్ రాబట్టింది అనేది తెలుస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: