టాలీవుడ్ సినిమా పరిశ్రమలోనే కాదు యావత్ భారతీయ సినిమా పరిశ్రమలోనే అత్యధిక ఖర్చు, అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన ప్రతిష్టాత్మక సినిమా ఆర్ఆర్ఆర్. తొలిసారిగా టాలీవుడ్ స్టార్ హీరోస్ ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించిన ఈ భారీ సినిమాని దర్శకదిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించగా డివివి దానయ్య నిర్మించారు. ఇక విడుదల తరువాత ఎంతో పెద్ద సెన్సేషనల్ సక్సెస్ అందుకున్న ఆర్ఆర్ఆర్ ఎన్నో ప్రాంతాల్లో మంచి రికార్డులు నమోదు చేసింది. ఇక ఈ మూవీ ద్వారా దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా కూడా అనేకమంది ప్రేక్షకాభిమానుల ప్రేమను చూరగొన్న ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ కూడా ఇకపై తమ కెరీర్ లో తమ సినిమాలు ఎక్కువ మంది ప్రేక్షకులకి చేరువయ్యేలా పాన్ ఇండియా మూవీస్ ని చేసేందుకు సిద్ధం అయ్యారు.

ముందుగా చరణ్ ప్రస్తుతం శంకర్ తో కలిసి చేస్తున్న భారీ ప్రాజక్ట్ ఇప్పటికీ నలభై శాతానికి పైగా పూర్తి అయినట్లు టాక్. చరణ్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ చేస్తున్నారని సమాచారం. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ భారీ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. అందరి అంచనాలు, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కోరుకునే అన్ని అంశాల మేళవింపుగా ఎంతో అత్యద్భుతంగా శంకర్మూవీ తీస్తున్నారని, తప్పకుండా వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ అయి పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం అని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది .

మరోవైపు ఇప్పటికే కొరటాల శివ తో తన నెక్స్ట్ సినిమా అనౌన్స్ చేసారు ఎన్టీఆర్. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై ఎంతో భారీ స్థాయిలో రూపొందనున్న ఈ మూవీ జూన్ లో పట్టాలెక్కి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానున్నట్లు టాక్. మంచి మాస్ యాక్షన్ తో పాటు భారీ స్థాయి కమర్షియల్ హంగులు కలగలిపి కొరటాల శివసినిమా కథ సిద్ధం చేసారని, వచ్చే ఏడాది రిలీజ్ తరువాత ఈ మూవీ పెద్ద విజయం అందుకోవడం ఖాయం అని టాలీవుడ్ ఇన్నర్ వర్గాల సమాచారం. మొత్తంగా దీనిని బట్టి చూస్తుంటే అటు ఎన్టీఆర్, ఇటు చరణ్ ఇద్దరూ కూడా రాబోయే తమ తమ సినిమాల ద్వారా బాక్సాఫీస్ రచ్చ చేయడం గట్టిగానే కనపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: