బాలివుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు..తెలుగు, హిందీలో పలు చిత్రాల్లో నటించి మంచి పేరును తెచ్చుకుంది..అయితే అమ్మడు సినిమాల కన్నా కూడా ఎక్కువగా వివాదాలతో  బాగా ఫెమస్ అయ్యింది..కొన్ని ఆమె మెడకు చుట్టుకున్నాయి.అయిన లెక్క చెయ్యకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతుంది.ఇప్పుడు కూడా మరో కొత్త కథతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొని వచ్చింది.భారీ అంచనాల తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ధాకడ్ పరిస్థితి దారుణంగా మారింది.


ధాకడ్'కు బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం తప్పేట్లు లేదు. ఈ సినిమా గురించి కంగనా చెప్పుకున్న గొప్పలు అన్నీ ఇన్నీ కావు. హాలీవుడ్ సూపర్ హీరోయిన్ సినిమాల తరహాలో భారీ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కించగా.. ఈ చిత్రంతో ఇండియాలో తనకు 'సూపర్ ఉమన్' తరహా ఇమేజ్ వచ్చేస్తుందని కంగనా భావించింది.ఈ సినిమా ప్రమోషన్ల సందర్భంగా హెలికాఫ్టర్లలో తిరుగుతూ.. మీడియా ముందు తనకు తాను ఎలివేషన్లు ఇచ్చుకుంటూ చాలా అతే చేసింది కంగనా. 'మణికర్ణిక' టైంలో దర్శకుడు క్రిష్‌ను అవమానించి.. ఆ సినిమా క్రెడిట్ అంతా తనదే అన్నట్లు పోజులు కొట్టడం.. ఆ తర్వాత రాజకీయ వ్యవహారాల్లో శ్రుతి మించి మాట్లాడటం.. తమ పాటికి తాము ఉన్న బాలీవుడ్ సెలబ్రెటీలను కెలికి మరీ వాళ్లను కించపరిచేలా మాట్లాడ్డం.. ఇలా చాలానే చేసింది కంగనా..


ఇవన్నీ కూడా జనాలను బాగా ప్రభావితం చెసిందని తెలుస్తుంది.ఆమె సినిమాను అసలు పట్టించుకోవట్లేదు. తొలి రోజు ఈ చిత్రానికి దేశవ్యాప్తంగా వచ్చిన నెట్ వసూల్లు రూ.50 లక్షలే అని ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. ఇదే నిజమైతే.. కంగనాకు ఇంతకంటే పరాభవం ఇంకోటి లేనట్లే. 'మణికర్ణిక' సహా కొన్ని విజయాలతో తాను స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోనట్లుగా మాట్లాడేది.ఆ తల పొగరు తో విర్రవీగుతూ రెచ్చిపొయింది.ఆమె సినిమాకు బాక్సాఫీస్ దగ్గర ఇంత దారుణమైన వసూళ్లు వచ్చాయి. ఈ ట్రెండ్ చూస్తుంటే ఫుల్ రన్లో సినిమా రూ.5 కోట్లు కూడా వసూలు చేసేలా లేదు. అందులోనూ 'భూల్ భూలయియా-2' లాంటి ఎంటర్టైనర్‌తో కంగనా సినిమా పోటీ పడింది. ఆ చిత్రానికి మంచి టాక్ వచ్చింది.ఇక ముందు అమ్మడు సినిమాలు నిల్వలేవని తెలుస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: