ఎన్టీఆర్ ప్రస్తుతం రెండు పాన్ ఇండియా సినిమాలకు కమిట్ అయిన విషయం మన అందరికి తెలిసిందే  ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను పెంచుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాకు , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాకు కమిట్ అయ్యాడు.  తాజాగా ఈ రెండు సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటనలు కూడా వచ్చేశాయి.  మరి కొన్ని రోజుల్లోనే ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

ఇప్పటికే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనున్నట్లు,  రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికీ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయంపై మాత్రం చిత్ర బృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మొదట ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అయ్యింది.  ఆ తర్వాత కియారా అద్వానీ నటించబోతున్నట్లు వార్తలు వచ్చాయి.

ఆ తర్వాత ఎన్టీఆర్ సరసన దిశా పటాని నటించబోతున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాలో ఎన్టీఆర్ సరసన కేజిఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఇప్పటికే కొరటాల శివ ఎన్టీఆర్ 30 వ సినిమా కోసం శ్రీనిధి శెట్టి ని సంప్రదించినట్లు , ఈ ముద్దుగుమ్మ కూడా ఈ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.  మరి ఈ వార్త ఎంతవరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: