విక్టరీ వెంకటేష్ తాజాగా ఎఫ్ 3 మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ మూవీ లో విక్టరీ వెంకటేష్ తో పాటు వరుణ్ తేజ్ కూడా హీరోగా నటించాడు. ఈ మూవీ కి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించగా తమన్నా,  మెహరీన్ ఈ మూవీ లో హీరోయిన్ లుగా నటించారు. ఈ సినిమా మే 27 వ తేదీన గ్రాండ్ గా విడుదల కాబోతోంది. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడడంతో తాజాగా చిత్ర బృందం గ్రాండ్ గా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాటు చేసింది.

ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా వెంకటేష్ మాట్లాడుతూ... నారప్ప మరియు దృశ్యం 2 వంటి నా రెండు మూవీ లు కూడా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లలో విడుదల అయినప్పుడు నా అభిమానులు కొంచెం నిరాశకు గురయ్యారు.  ఎఫ్ 3 మూవీ తో నేను మీకు హామీ ఇస్తున్నాను,  మేము మీకు అద్భుతమైన అనుభవాన్ని అందిస్తాము అని తాజాగా ఎఫ్ 3 ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా వెంకటేష్ తెలియజేశాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎఫ్ 2 మూవీ మంచి విజయం సాధించడంతో ప్రేక్షకులు ఎఫ్ 3 మూవీ పై మంచి అంచనాలు పెట్టుకున్నారు.  

మరి ఎఫ్ 3 సినిమా ఏ రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంటుందో చూడాలి.  ఈ మూవీ లో సోనాల్ చౌహాన్ ఒక కీలకమైన పాత్రలో నటించగా,  పూజా హెగ్డే ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది.  ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా,  ఈ మూవీ లో అలీ , సునీల్ ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: