యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తాజాగా నటించిన విక్రమ్ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది. జూన్ 3 వ తేదీన కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతుంది.  లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. విక్రమ్ సినిమాలో క‌మ‌ల్ హాస‌న్‌, ఫ‌హ‌ద్ ఫాజిల్‌, విజ‌య్‌సేతుప‌తి. లాంటి హేమాహేమీలు నటులు నటించడం,  అలాగే సూర్య ఈ సినిమాలో ఒక కీలక పాత్రను పోషించడం,  మానగరం, ఖైదీ, మాస్టర్ వంటి వరుస బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత లోకేష్ కనకరాజు ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై ఫుల్ క్రేజ్ ఏర్పడింది.

కొన్ని రోజుల క్రితం విడుదలైన ట్రైలర్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండడంతో ఈ సినిమాపై అంచనాలు ప్రేక్షకుల్లో మరింతగా పెరిగిపోయాయి. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా తెలుగు ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను హీరో నితిన్ సొంత బ్యానర్ అయిన శ్రేష్ట మూవీస్ సంస్థ దక్కించుకుంది. హీరో నితిన్ సొంత బ్యానర్ శ్రేష్ట మూవీస్ సంస్థ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన విక్రమ్ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను 6 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం.

కమల్ హాసన్, విజయ్ సేతుపతి , ఫ‌హ‌ద్ ఫాజిల్‌ , సూర్య లాంటి నటులు నటించిన,  లోకేష్ కనకరాజు లాంటి ఫుల్ క్రేజ్ ఉన్న దర్శకుడు దర్శకత్వం వహించిన సినిమా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులు కేవలం ఆరు కోట్లకు దక్కడం అనేది నితిన్ లాక్ అని కొంత మంది భావిస్తున్నారు. ఒక వేళ సినిమాకు గనక పాజిటివ్ టాక్ వచ్చినట్లయితే 6 కోట్ల షేర్ కలెక్షన్లు అవలీలగా ఈ సినిమా కొట్టే అవకాశం ఉండడంతో నితిన్ విక్రమ్ సినిమాతో జాక్ పాట్ కొట్టేసాడు అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. రాబోయే రోజుల్లో నితిన్ 'విక్రమ్'  సినిమా ప్రమోషన్స్ ను అదిరిపోయే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: