తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ ఉంటారు. కానీ వారిలో కొంతమందికి మాత్రం వరస అవకాశాలు దక్కుతూ ఉంటాయి. అదే మరి కొంత మంది తమ అందంతో, నటనతో ఆకట్టుకున్నప్పటికి వారికి ఇతర భాషల్లో అవకాశాలు బాగానే వస్తుంటాయి కానీ తెలుగులో మాత్రం అవకాశాలు పెద్దగా అవకాశాలు దక్కాని ముద్దుగుమ్మలు కూడా ఉంటారు. ప్రస్తుతం ఇలాంటి పరిస్థితినే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎదుర్కొంటున్నట్లు తాజాగా శోభితా ధూళిపాళ తెలియజేసింది. అందాల ముద్దుగుమ్మ శోభిత ధూళిపాళ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఈ ముద్దుగుమ్మ అడవి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కిన గూడచారి సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది.  ఈ సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెద్దగా అవకాశాలు మాత్రం దక్కలేదు.  కానీ ఇతర బాషా సినిమా ఇండస్ట్రీలలో మాత్రం ఈ ముద్దుగుమ్మ వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్ ను చూపిస్తుంది.  ఇది ఇలా ఉంటే తాజాగా శోభితా ధూళిపాళ  'మేజర్'  సినిమాలో కీలక పాత్రలో నటించింది.  

ఈ సినిమాలో కూడా అడవి శేషు హీరోగా నటించగా శశికిరణ్ తిక్కమూవీ కి దర్శకత్వం వహించాడు.  ఈ సినిమా జూన్ 3 వ తేదీన విడుదల కాబోతుంది.  ఈ నేపథ్యంలో శోభితా ధూళిపాళ మీడియాతో మాట్లాడుతూ...  తాను బయట చాలా భాషల్లో మూవీ లు చేస్తున్నాను అని,  టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం సరిగ్గా అవకాశాలు రావడం లేదు అని ఈ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. రానున్న రోజుల్లో టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎక్కువ సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తాను అని తాజాగా శోభితా ధూళిపాళ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: