సొనాక్షి సిన్హా హీరోయిన్‌గా 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఇప్పటికీ భారీ ప్రాజెక్టుల్లో అవకాశాలు అందుకుంటూనే ఉంది. అయితే 2010లో 'దబాంగ్'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలా విమర్శలొచ్చాయి. సొనాక్షి ఫేస్‌కి హీరోయిన్ ఏంటి అని ట్రోల్ చేశారు. కానీ సొనాక్షి కంటెంట్‌తో బాడీ షేమింగ్‌ని ఎటాక్‌ చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా యంగ్‌ఏజ్‌కి రాగానే ఎందుకు బరువు తగ్గాలని ప్రయత్నిస్తారు.. పక్కనోళ్లు ఏమనుకుంటారో అనే ఇన్‌ఫీరియారిటీ కాంప్లెక్స్‌ నుంచి బయటపడండని పెద్ద పోస్ట్‌ పెట్టింది సొనాక్షి.

హ్యూమా ఖురేషి హిందీ సినిమాలతో పాటు తమిళ్, ఇంగ్లీష్‌ ఫిల్మ్స్‌లోనూ నటించింది. అయితే సూపర్ టాలెంటెడ్‌ అని ప్రూవ్‌ చేసుకున్నా, హ్యూమా వెయిట్‌పై చాలా విమర్శలొచ్చాయి. హ్యూమా సినిమా సినిమాకి బరువు పెరుగుతోందని, హీరోయిన్‌ కటౌట్‌ కాదనే కామెంట్స్ ఫేస్‌ చేసింది. ఈ బాడీ షేమింగ్‌పై హ్యూమా కూడా రియాక్ట్ అయింది. తనను తానే ఇష్టపడుతున్నప్పుడు, ఇతరుల అభిప్రాయాన్ని  పట్టించుకోనని చెప్పింది.

బాలీవుడ్‌లో టాప్‌ హాట్‌ హీరోయిన్స్‌లో లిస్ట్‌లో ముందుంటుంది బిపాసా బసు. బోల్డ్‌ రోల్స్‌తో వెండితెరకి వేడి పుట్టించిన బిపాసా కలర్‌పైనా కామెంట్స్‌ వచ్చాయి. కరీనా కపూర్‌ ఒకసారి 'బిపాసా ఈజ్‌ ఎ కల్లీ బిల్లీ' అని కామెంట్‌ చేసింది. ఇది బాలీవుడ్‌లో పెద్ద దుమారం కూడా రేపింది. కృతిసనన్ ఇప్పుడు బాలీవుడ్‌లో వన్‌ ఆఫ్ ది టాప్ హీరోయిన్. 'ఆదిపురుష్, షెహజాదే' లాంటి సినిమాలతో స్వింగ్‌లో ఉంది. అయితే 'రాబ్తా' తర్వాత కృతిసనన్ 'ముబారకన్' సినిమాని ప్రమోట్‌ చేస్తూ ఒక డాన్స్‌ వీడియో పోస్ట్‌ చేసింది. దీనికి బాలీవుడ్‌ నటి భైరవి గోస్వామి డీ-గ్రేడ్ కామెంట్‌ పెట్టింది. హెడ్‌లైట్స్, బంపర్‌ లేని బండిలా ఉంది. అసలు హీరోయిన్ ఎలా అయింది. ఈమె కంటే కాలేజ్‌ స్టూడెంట్స్‌ బాగుంటారని విమర్శించింది.

షారుక్ ఖాన్ కూతురు సుహానా ఖాన్‌ ఎంట్రీ గురించి న్యూస్ వచ్చినప్పటి నుంచి బాలీవుడ్‌ మొత్తం ఈమె సినిమా కోసం ఎదురుచూస్తోంది. షారుక్‌ కూతురు ఎలా చేస్తుందో అని చర్చించుకుంటున్నారు. అయితే నెటిజన్లు మాత్రం సుహానా కలర్‌పైన కామెంట్ చేస్తున్నారు. డార్క్‌ స్కిన్‌, కాలీ అని విమర్శిస్తున్నారు.

మైఖెల్‌ జాక్సన్‌ పాప్‌ ప్రపంచంలో రారాజు. నేటికీ మైఖెల్‌ని మ్యాచ్ చేసే పాప్‌ సింగర్ లేడు. అయితే ఈ పాప్‌ కింగ్‌ కూడా బాడీ షేమింగ్‌ని ఎదుర్కొన్నాడు. పుట్టుకతో వచ్చిన నలుపు రంగుని తొలగించుకోవడానికి ఎన్నో సర్జరీలు చేయించుకున్నాడు. తెల్లటి బొమ్మలా మారిపోయాడు. అయితే జనాలు మైఖెల్‌ రూపం కంటే, ఆయన పాటనే ఎక్కువ ఇష్టపడ్డారు. ఆ టాలెంట్‌నే అభిమానించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: