దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. కాకపోతే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావడానికి ఇంకా కాస్త సమయం పట్టబోతోంది. తాజాగా సర్కార్ వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది.

మూవీ షూటింగ్ పూర్తి అయిన తర్వాత రాజమౌళి,  మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. అలాగే కొంత కాలం క్రితమే రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల అయ్యింది.  చాలా సంవత్సరాలపాటు ఆర్ ఆర్ ఆర్ మూవీ పై పని చేసిన రాజమౌళి కూడా కొంతకాలం పాటు రెస్టు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వీరిద్దరు తమ తమ పనులు ముగించు కొని ఆ తర్వాత తర్వాత సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నట్లు తెలుస్తోంది.  కాకపోతే రాజమౌళి మాత్రం కాస్త ముందుగానే మహేష్ బాబు సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించినున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా ఇప్పటికే కొన్ని పనులను ప్రారంభించినట్లు కూడా  తెలుడుతుంది. తాజాగా మహేష్ బాబు తో రాజమౌళి తెరకెక్కించబోయే సినిమాకు సంబంధించి రాజమౌళి ఒక నటుడి తేదీల కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తేలుతుంది. మహేష్ బాబు , రాజమౌళి కాంబినేషన్ లో తెరకెక్కబోయే  సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం కమల్ హాసన్ ను సంప్రదించాలని రాజమౌళి ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మహేష్ బాబు హీరోగా రూపొందబోతున్న ఈ మూవీ లో ఓ ప్రత్యేక పాత్రను కమల్ హసన్ మాత్రమే చేయగలడు అని రాజమౌళి భావిస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: