యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా జూనియర్ ఎన్టీఆర్ కు కెరియర్ పరంగా 30 వ సినిమా. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ ను కూడా చిత్ర బృందం చేసింది. తాజాగా ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ ను  విడుదల చేసిన చిత్ర బృందం ఆ మోషన్ పోస్టర్ లో భాగంగానే ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించబోతున్నట్లు, రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేయబోతున్నట్లు చిత్ర బృందం అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసింది.

మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం కాబోతోంది. కాకపోతే ఇప్పటి వరకు ఎన్టీఆర్ 30 వ సినిమాలో హీరోయిన్ గా నటించేది ఎవరు అనేది మాత్రం చిత్ర బృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాకపోతే ఎన్టీఆర్ 30వ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించేది ఈ ముద్దుగుమ్మె అంటూ అనేక మంది పేర్లు మాత్రం ఇప్పటివరకు తెరపైకి వచ్చాయి. అందులో భాగంగా మొదట రష్మిక మందన పేరు తెరపైకి వచ్చింది.

ఆ తర్వాత కియారా అద్వానీ, దిశా పటాని,  ఆ తర్వాత 'కే జి ఎఫ్' బ్యూటీ శ్రీనిధి శెట్టి ని చిత్ర బృందం సంప్రదించినట్లు ఇలా అనేక మంది పేర్లు తెరపైకి వచ్చాయి.  ఇప్పుడు తాజాగా మరో ఇద్దరు బాలీవుడ్ బ్యూటీ ల పేర్లు ఈ లిస్ట్ లోకి చేరాయి. ఎన్టీఆర్,  కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ లుగా నటించడం కోసం బాలీవుడ్ బ్యూటీలు అనన్య పాండే, జాన్వి కపూర్ పేర్లను చిత్ర బృందం పరిశీలిస్తున్నట్లు తాజాగా ఒక వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: