పవర్ స్టార్ పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.అప్పటి నుంచి ఇప్పటివరకు వస్తున్న సినిమాలు అన్నీ కూడా భారీ హిట్ ను అందిస్తున్నాయి. మొన్నీమధ్య వచ్చిన వకీల్ సాబ్,భీమ్లా నాయక్ చిత్రాలతో వరుస హిట్లను ఖాతాలో వేసుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌.. ప్రస్తుతం ప్రముఖ స్టార్ డైరెక్టర్ క్రిష్ తో `హరి హర వీరమల్లు` అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ బాగా కష్ట పడుతున్నాడని తెలుస్తుంది.మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.నిధి అగర్వాల్ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్, పూజిత పొన్నాడ తదితరులు ఇందులో కీలక పాత్రలను పోషిస్తున్నారు. 17వ శతాబ్దం నేపథ్యంలో పీరియాడికల్‌ డ్రామాగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రానికి ఎం.ఎం.కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ పార్ట్ ను పూర్తీ చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది..తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా బడ్జెట్ మరింత పెరిగినట్టు వార్తలు వస్తున్నాయి. మొదట్లో ఈ సినిమాని రూ. 150 నుంచి రూ. 180 కోట్ల లోపు ప్లాన్ చెయ్యగా ఇప్పుడు అది కాస్త రూ. 200 కోట్లకి వెళ్లినట్టు జోరుగా టాక్ నడుస్తోంది..సెట్ వర్క్స్ మరియు గ్రాఫిక్స్ కే ఎక్కువగా ఖర్చు చేస్తున్నారని అంటున్నారు. ఏదేమైనా రూ. 200 కోట్ల బడ్జెట్ అంటే క్రిష్ రిస్క్ చేస్తున్నట్లే అవుతుంది. కాగా, ఈ మూవీ అనంతరం పవర్ హరీష్ శంకర్ డైరెక్షన్‌లో `భవదీయుడు భగత్ సింగ్` అనే సినిమా చేయనున్నాడు. అలాగే తమిళంలో హిట్ అయిన `వినోదాయ సీతం` రీమేక్‌ను సైతం పవన్ చేతిలో ఉన్నట్లు  తెలుస్తుంది.. ఆ సినిమాలలో ఏ సినిమా పవన్ కు బెస్ట్ గా నిలుస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: