సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటుడు రాజశేఖర్ ఈ మధ్య కాలంలో తన సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలుపెట్టి సినిమాలు తీస్తున్నారు. ఇక తన భార్య జీవిత డైరెక్షన్లో వచ్చిన తాజా చిత్రం శేఖర్. ఈ చిత్రనికీ షాక్ తగిలిందని చెప్పవచ్చు. శేఖర్ చిత్రం నిలిపివేయాలని సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ సినిమా ప్రదర్శన అన్ని థియేటర్లలో ఆగిపోయినట్లు గా సమాచారం. రాజశేఖర్ తనకు డబ్బులు ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు ఫైనాన్సియర్ పరంధామ రెడ్డి.


 కోర్టు ఆదేశించిన డబ్బు డిపాజిట్ చేయకపోవడంతో తాజాగా సినిమా నిలిపెయాల్సింది అంటూ ఉత్తర్వులు జారీ చేశాయి. తన దగ్గర రూ.65 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్న దర్శకనిర్మాత జీవిత రాజశేఖర్ తిరిగి చెల్లించకపోవడంతో కోర్టును ఆశ్రయించారు ఫైనాన్సియల్ పరంధామ రెడ్డి. ఆదివారం సాయంత్రం నాలుగున్నర లోగా సెక్యూరిటీ డిపాజిట్ గా కోర్టుకు సమర్పించాలని తెలియజేయడం జరిగింది. అలాంటి డిపాజిట్ చేయని పక్షంలో సినిమా హక్కులను తనకే ఇవ్వాలని పరంధామరెడ్డి పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. ఆ మేరకే ఇప్పుడు కోర్టు ఉత్తర్వులు ఇచ్చినట్లు సమాచారం.


కోర్టు తీర్పుపై హీరో రాజశేఖర్ స్పందించారు. తన సినిమానే కొందరు కుట్ర పరంగా అడ్డుకుంటున్నారని తెలిపారు. చాలా కష్టపడి శేఖర్ సినిమా తెరకెక్కించారని సినిమానే తన జీవితమని శేఖర్ సినిమా తమకు ఒక హోప్ లాంటిదని తెలియజేశారు. ఇలాంటి సమయంలో ఏం మాట్లాడాలో తనకు అర్థం కావడం లేదని రాజశేఖర్ తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. ఈ సినిమాకు దక్కాల్సిన ప్రాధాన్య తప్పకుండా దక్కుతుందని తను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు గా తెలియజేశారు. ఇక ఇందులో జీవిత రాజశేఖర్ పెద్ద కుమార్తె శివాని ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఈనెల 20వ తేదీన ఈ సినిమా విడుదలై మంచి ప్రేక్షకుల ఆదరణ లభించింది. ఇప్పుడు తాజాగా ఈ చిత్ర ప్రదర్శనను నిలిపివేయాలని కోర్టు ఆదేశాలతో పెద్ద షాక్ ఇచ్చిన అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: