ప్రతి సంవత్సరం ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ దగ్గర విడుదల అవుతూ ఉంటాయి. అందులో కొన్ని సినిమాలు విడుదలకు ముందే భారీ అంచనాలు ఉండటంతో ఆ సినిమాలకు అధిక మొత్తంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ లు జరుగుతుంటాయి. అధిక మొత్తంలో ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న కొన్ని సినిమాలకు కొన్ని సందర్భాలలో బాక్సాఫీస్ దగ్గర కనుక నెగిటివ్ టాక్ వచ్చినట్లయితే ఆ సినిమాలకు తీవ్ర నష్టాలు వస్తు ఉంటాయి. ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆచార్య సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఆచార్య సినిమాపై సినిమా విడుదలకు ముందు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

భారీ అంచనాలు నెలకొని ఉండడంతో ఈ సినిమాకు ఫ్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో జరిగింది. అందులో భాగంగా ఆచార్య సినిమాకు ఒక్క నైజాం ఏరియాలోనే 38 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. నైజాం ఏరియాలో అదిరిపోయే ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకొని భారీ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఆచార్య సినిమా విడుదలైన మొదటి రోజు నుండే బాక్సాఫీస్ దగ్గర నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. నెగిటివ్ టాక్ రావడంతో ఆచార్య సినిమాకు మొదటి రోజు మినహాయిస్తే నైజాం ఏరియాలో ఆ తర్వాత రోజు కలెక్షన్లు భారీ మొత్తంలో నమోదు కాలేదు.  

మొత్తం మీద ఆచార్య సినిమా నైజాం ఏరియాలో ఫుల్ రన్ లో 12.45 కోట్ల మేర షేర్ మాత్రమే రాబట్టగలిగింది.  దీనితో ఆచార్య సినిమాకు నైజాం ఏరియాలో దాదాపుగా  25.55 కోట్ల మేర లాసులు వచ్చినట్టు తెలుస్తోంది. ఆచార్య సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మూవీ లో ఒక కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కి మణిశర్మ సంగీతాన్ని. అందించాడు

మరింత సమాచారం తెలుసుకోండి: