ప్రతి వారం బాక్స్ ఆఫీస్ దగ్గర అనేక సినిమాలు విడుదల అవడం అనేది చాలా సర్వ సాధారణంగా జరిగే విషయం. కానీ కొన్ని సందర్భాలలో మాత్రం మంచి క్రేజ్ ఉన్న సినిమాలు అన్ని  ఒకే వారంలో విడుదల అవుతూ ఉంటాయి.  అలా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉన్న సినిమాలు ఒకే వారంలో థియేటర్లలో విడుదల కావడం ద్వారా ఆ సినిమా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఆ సినిమాలో ఏ సినిమాకు అయిన పాజిటివ్ టాక్ వచ్చినట్లు అయితే ఆ సినిమాకు కూడా ఇతర సినిమాల ద్వారా ఏర్పడిన పోటీ వల్ల  తక్కువ కనెక్షన్లు నమోదు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినట్లయితే ఆ మూవీ లకు అతి తక్కువ కలెక్షన్లు బాక్సాఫీస్ దగ్గర నమోదు అయ్యే అవకాశాలు ఉంటాయి.  

ఇది ఇలా ఉంటే ఈ ఆగస్టు నెలలో కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఇలాంటి పరిస్థితులే కనబడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు విషయం లోకి వెళితే...  ఆగస్టు నెల రెండవ వారంలో కొన్ని సినిమాల విడుదల చేయనున్నట్లు చిత్ర బృందాలు ఇప్పటికే ఆఫీషియల్ విడుదల తేదీలను ప్రకటించాయి.  అలాగే మరి కొన్ని సినిమాలను ఆగస్టు నెల రెండవ వారంలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.  మరి ఆ సినిమాల గురించి తెలుసుకుందాం...

ఆగష్టు 12 వ తేదీన అఖిల్ అక్కినేని హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్ సినిమాను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.
సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన యశోద సినిమాను కూడా ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.
తమిళ స్టార్‌ హీరో విక్రమ్‌ హీరోగా తెరకెక్కిన ‘కోబ్రా’ మూవీ ఆగస్ట్‌ 11 న సౌత్‌ మొత్తం భారీ స్థాయిలో రిలీజ్‌ కానుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా తాజాగా వచ్చేసింది.
ఈ సినిమాలతో పాటు మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న గాడ్ ఫాదర్ సినిమాను కూడా ఆగస్టు ఈ నెల రెండవ వారంలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ ఆగస్టు నెల రెండవ వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరిగేటట్లు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: