పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో భవదీయుడు భగత్ సింగ్ సినిమా తెరకెక్కబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా వచ్చి చాలా కాలమే అవుతుంది. ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఇది వరకు గబ్బర్ సింగ్ సినిమా తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. గబ్బర్ సింగ్ హిందీ మూవీ దబాంగ్ కి తెలుగు రీమేక్ గా తెరకెక్కింది. గబ్బర్ సింగ్ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ లో మంచి విజయవంతమైన సినిమాగా నిలిచింది. అలాగే ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ కు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో అదిరిపోయే క్రేజ్ ను తీసుకువచ్చింది.  

ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో భవదీయుడు భగత్ సింగ్ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా హరీష్ శంకర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.  పవన్ కళ్యాణ్ తో తనకు రెండు రీమేక్ సినిమాలను డైరెక్ట్ చేయడానికి అవకాశం వచ్చింది అని , కాకపోతే పవన్ కళ్యాణ్ తో ఈ సారి ఒక స్ట్రీట్ సినిమా దర్శకత్వం వహించాలని ఉద్దేశంతో రీమేక్ సినిమాలను రిజెక్ట్ చేసినట్లు హరీష్ శంకర్ తెలియజేశాడు.  

అందుకోసం పవన్ కళ్యాణ్ ని దృష్టిలో ఉంచుకొని ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ ను రెడీ చేసినట్లు హరీష్ శంకర్ తెలియజేశాడు.  ఈ పవర్ ఫుల్ కథలో పవన్ కళ్యాణ్ లెక్చరర్ పాత్రలో కనిపించబోతున్నట్లు హరీష్ శంకర్ వివరించాడు.  ఇలా తాజాగా భవదీయుడు భగత్ సింగ్ సినిమా గురించి హరీష్ శంకర్ అనేక ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.  పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కబోయే భవదీయుడు భగత్ సింగ్ మూవీ ని  మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: