కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించబోయే సినిమా ఇటీవలే అధికారికంగా ప్రకటించబడింది. చాలా రోజులుగా ఎన్టీఆర్ నటించబోయే తదుపరి సినిమా ఎప్పుడూ ఉంటుంది అన్న అంచనాలను ఏర్పరచుకోగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడింది. ఆచార్య సినిమా తరువాత ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న కొరటాల శివ ఇప్పుడు ఈ చిత్రాన్ని చేయడం విశేషం.

ఈ సినిమాకు సంబంధించిన ఓ వీడియోని విడుదల చేసి చిత్రంపై అంచనాలు ఇప్పటికే ఇప్పటినుంచే పెంచేలా చేశాడు దర్శకుడు. ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం సాంకేతిక నిపుణులను చిత్రబృందం ప్రకటించింది. మెయిన్ టెక్నీషియన్స్ జాబితాను విడుదల చేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అన్నదానిపై ఇప్పటివరకు క్లారిటీ రాలేదు. గతంలో ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది అని చాలామంది
 చెప్పారు.

అయితే ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలుగు సినిమాలలో నటించడం లేదు అని చెప్పడం తో ఆమె ఈ చిత్రంలో నటించడం లేదు అని ఖరారు అయ్యింది.  ఆ తర్వాత ఎన్టీఆర్ కూడా ఆమె గురించిన ఎటువంటి వార్తలు ఇప్పటి దాకా చేయకపోవడం ఈ సినిమా లో ఆమె లేదనే ఎక్కువగా తెలుస్తుంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం ఎవరిని వరిస్తుందో చూడాలి. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా ఉన్న రష్మిక మందన కు ఈ ఛాన్స్ వరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి ఆమె చేతిలో పెద్ద హీరోల సినిమాలు బాగానే ఉన్నాయి. మరి అన్ని కలిసి వచ్చి ఈ సినిమాలో ఆమె హీరోయిన్ గా ఎంపిక అయితే ఆమెకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లే అని చెప్పాలి. ఎన్టీఆర్ కి కూడా ఇప్పుడు ఆమె క్రేజ్ ను వాడుకోవడం ఇప్పుడు తప్పనిసరి. 

మరింత సమాచారం తెలుసుకోండి: