విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఖుషి. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా మొదటి షెడ్యూల్ ను కశ్మీర్ లో పూర్తి చేసుకుంది. అక్కడ నటీనటుల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించిన చిత్ర బృందం ఆ తరువాత హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో రెండో షెడ్యూల్ షూటింగ్ ను వచ్చే నెల మొదటి వారంలో జరపనుంది. తదుపరి బాగాన్ని అక్కడ పూర్తి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. విభిన్న ప్రేమ కథా సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.

ఈ చిత్రానికి ఖుషి అనే టైటిల్ ను పెట్టడం ఒక్కసారిగా అందరినీ ఎంతగానో ఆశ్చర్యపరిచింది అని చెప్పాలి. పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన క్లాసిక్ హిట్ చిత్రం అయిన ఖుషి సినిమా యొక్క టైటిల్ ను ఈ సినిమా కి పెట్టడం దీనికి కారణం. కారణం ఏదైనా కూడా విజయ్ దేవరకొండ అభిమానులు ఈ సినిమా యొక్క టైటిల్ పట్ల ఎంతో ఆసక్తి కనబరిచారు. మొదట్లో ఈ సినిమా టైటిల్ గురించి పోటాపోటీ అభిమానుల మధ్య నెలకొంది. ఒకరికొకరు విమర్శల పర్వం కొనసాగించుకున్నారు. 

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఈ టైటిల్ ను ఎందుకు పెట్టారో చిత్రబృందం వివరించే ప్రయత్నం చేసింది. సినిమాలోని హీరోయి న్ పేరు ఖుషీ. సినిమా మొత్తం హీరోయిన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ సినిమాకు తప్పక ఈ టైటిల్ ను పెట్టడం జరిగింది అనీ చెబుతున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం అవుతు న్న వార్తలను బట్టి ఇది తెలుస్తుంది.  దీనిలో ఎంత వరకు నిజం ఉందో తెలియదు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ నిన్నటితో పూర్తయింది. తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనున్నట్లు చిత్రబృందం వెల్లడిస్తోంది 

మరింత సమాచారం తెలుసుకోండి: