అక్కినేని అఖిల్ హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఏజెంట్ అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రంలో అఖిల్ రా ఏజెంట్ గా కనిపించబోతున్నాడు.  సాయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పై మంచి అంచనాలే ఉన్నాయి. టాలీవుడ్ సినిమా పరిశ్రమలో స్టైలిష్ యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరుగా ఉన్నాడు సురేందర్ రెడ్డి. సైర లాంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత ఆయన చేస్తున్న ఈ సినిమా తప్పకుండా మరొక సంచలన విజయాన్ని అందుకుంటుందని అక్కినేని అభిమానులు భావిస్తున్నారు.

దానికి తగ్గట్లుగానే ఈ సినిమాలో అఖిల్ లుక్ ను బాగా డిజైన్ చేశాడు.  ఇంతకుముందు ఎంత స్టైలిష్ గా అఖిల్ ఏ సినిమాలోనూ కనిపించలేదనే చెప్పాలి. లుక్స్ తో నే అందరిని ఫ్లాట్ చేసిన ఈ ఇద్దరు తీసిన ఈ సినిమా ఏ స్థాయిలో తెరకెక్కిస్తారో చూడాలి. ఈ సినిమా విడుదల విషయంలో నిన్నటిదాకా ఎంతో గందరగోళం నెలకొంది కానీ నిర్మాత ఈ సినిమాకు సంబంధించిన విడుదల విషయంలో క్లారిటీ ఇవ్వగా అందరి నోళ్ళు మూయించారు. ఆగస్టులోనే ఈ సినిమా విడుదల కాబోతుంది అని చెబుతున్నారు.

అయితే అఖిల్ కు ఉన్న మార్కెట్ కంటే మించి ఆయన ఫ్యాన్స్ ఈ చిత్రానికి ప్రచారం చేస్తున్నారు. అంతే కాదు అఖిల్ ను పెద్ద హీరోలతో పోలుస్తూ అఖిల్ పై అతి అభిమానాన్ని చూపించడం ఓవర్ అవుతుంది అని చెప్పవచ్చు. ఇప్పటికే వరుస ప్లాపులతో సతమతం అవుతున్న ఈ హీరో ఇప్పుడే ఇంతటి ఓవర్ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్లడం అంత మంచిది కాదని కొంతమంది సినిమా విశ్లేషకులు చెబుతున్నారు. ఆయన అభిమానులు ఈ విధంగా హైలెట్ అయ్యేలా చేయడం అఖిల్ కు పెద్ద మైనస్ అవుతుందని కూడా వారు చెబుతున్నారు. మరి ఆయన అభిమానులు ఇప్పటికైనా తగ్గి అఖిల్ స్థాయిలోనే మార్కెట్ చేస్తే బాగుంటుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: