సినిమా పరిశ్రమలో సక్సెస్ ఉంటేనే అందరిని పట్టించుకుంటారు. లేదంటే ఎంతటి పెద్ద హీరో నీ అయినా కొన్ని రోజులు పక్కన పెడతారు మన ప్రేక్షకులు. ఆ విధంగా సక్సెస్ అనేది అందరికీ ఒక కీలక అంశంగా మారుతుంది. ఎక్కడైనా విజయం ఉన్న వ్యక్తుల వెంటే పరుగులు తీస్తూ ఉంటారు అందరూ. ఆ విధంగా సినిమా పరిశ్రమలో సైతం సక్సెస్ ఉన్న హీరోల చుట్టే సక్సెస్ ఉన్న దర్శకుల చుట్టూ అందరూ కూడా పరుగులు తీస్తూ ఉంటారు.

వరుస విజయాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన దర్శకుడు కొరటాల శివ పరిస్థితి నిన్నటి వరకు ఎంతో దారుణంగా ఉందని చెప్పాలి.  ఆయన తీసిన నాలుగు హిట్ సినిమాలను మించి ఆచార్య ఫ్లాప్ ప్రభావం ఆయనపై ఉంది అంటే ఆశ్చర్యపోనవసరం లేదు. అప్పటిదాకా అపజయం లేని దర్శకుడు గా ఉన్న ఈ దర్శకుడు ఒక్కసారిగా ఫ్లాప్ అందుకోవడంతో చాలామంది విమర్శలను ఎదుర్కొన్నాడు. అయితే ఆయనపై విమర్శలు ఎంతోకాలం నిలవలేదు అనే చెప్పాలి. ఆచార్య సినిమా విడుదలైన 15 రోజుల్లోనే ఆయన తన తదుపరి సినిమాకు సంబంధించిన అప్డేట్ ను విడుదల చేశాడు.

ఎన్టీఆర్ 30వ సినిమా ను చేస్తున్న కొరటాల శివ ఈ చిత్రం యొక్క వీడియోతో ప్రేక్షకులందరినీ మరొకసారి అలరించాడు. అందులోని డైలాగ్ తో అందరూ ఈ సినిమా కు బ్రహ్మరథం పట్టడం తో ఈ సినిమా తప్పకుండా హిట్ అవ్వడం ఖాయం అని అంటున్నారు. మరి ఈ సినిమా ఎంతో ముఖ్యమైన సినిమా కావడంతో ఏ స్థాయిలో ఈ చిత్రం ప్రేక్షకులను షూటింగ్ మొదలు పెట్టనున్నారు. ఈ సినిమా కథ ఎప్పుడో ఓకే అయినా కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడంలో విఫలం అయ్యారు. ఆలస్యంగా ఓకే అయిన ఈ సినిమా ఏవిధంగా ప్రేక్షకులను షూటింగ్ జరుపుకునీ విడుదలై సూపర్ హిట్ అందుకుంటుందో చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి: