ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు తెరకెక్కడం ఎంతో సహజం అయిపోయింది. టాలీవుడ్ సినిమా పరిశ్రమ నుంచి అయితే ప్రతి ఒక్క హీరో కూడా ఆ విధమైన సినిమాలే చేస్తూన్నాడు. ఈ నేపథ్యంలోనే అక్కినేని వారసుడిగా సినిమా పరిశ్రమకు పరిచయమై వరుస విజయాలు సాధించుకుంటూ పోతున్న హీరో నాగ చైతన్య కూడా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. సోలో హీరోగా ఆయనకు పాన్ ఇండియా సినిమా చేసే మార్కెట్ లేదనే చెప్పాలి.

అందుకే ఆయన అమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్న లాల్ సింగ్ చద్దా సినిమాలో ఓ కీలక పాత్ర పోషించి దాని ద్వారా బాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకోవాలని భావిస్తున్నాడు. హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టులో విడుదల కావడానికి సిద్ధమయ్యింది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్రంలోని ఓ కీలక పాత్రలో నటించిన నాగ చైతన్య తన పాత్ర ద్వారా తప్పకుండా అందరినీ అలరిస్తాడని అంటున్నారు. 

ఎంతో విభిన్నంగా ఉండే ఈ పాత్ర ద్వారా అన్ని భాషల ప్రేక్షకు లకు తాను చేరుకోవడం ఖాయం అని అక్కినేని అభిమానులు సైతం కోరుకుంటున్నారు. అంతేకాదు ఇప్పటికే ఆయన చేసిన కొన్ని సినిమాలు డబ్బింగ్ అయ్యి పలు భాషలలో విడుదల కాగా ప్రేక్షకుల  ను అలరించాయి. ఆ విధంగా మెల్లమెల్లగా మంచి ఇమేజ్ ను సంపాదించుకుని ఆ తరువాత సోలో హీరోగా నటించాలని నాగచైతన్య కోరిక. మరి నాగచైతన్య ఈ స్థాయి లో నెరవేరుతుందో చూడాలి. విక్రమ్ కుమార్ దర్శకత్వం లో థాంక్యూ అనే సినిమా చేస్తున్న నాగచైతన్య అదే సమయంలో దూత అనే మరొక విభిన్న కథాంశంతో కూడిన వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు ఆయనకు ఏ స్థాయిలో పేరు తీసుకు వస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: