అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్ , వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా , మెహరీన్ హీరోయిన్ లుగా ఆలీ , సునీల్ ఇతర ప్రధానపాత్రలలో దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమా ఎఫ్ 3 . ఈ సినిమా మే 27 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో చిత్ర బృందం లోని సభ్యులు పలు టీవీ ఛానల్ ఇంటర్వ్యూ లలో , సోషల్ మీడియా ఇంటర్వ్యూ లలో పాల్గొంటూ మూవీ ని ప్రమోట్ చేస్తున్నారు.

అందులో భాగంగా ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వీటికి ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.  ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఎఫ్ 2 మూవీ మంచి విజయం సాధించడంతో, ఎఫ్ 3 సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఇలా ఎఫ్ 3 మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న కారణంగా ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదిరిపోయే రేంజ్ లో జరిగింది. ఎఫ్ 3 మూవీ కి ప్రపంచవ్యాప్తంగా జరిగిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.
నైజాం : 22.5 కోట్లు .
వైజాగ్ : 7.8 కోట్లు .
ఈస్ట్ : 5.1 కోట్లు .
వెస్ట్ :4.5 కోట్లు .
గుంటూర్ : 5.4 కోట్లు .
నెల్లూర్ : 2.4 కోట్లు .
సీడెడ్ : 19.8 కోట్లు
మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఎఫ్ 3 మూవీ కి 63 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.


కర్ణాటక : 4.5  కోట్లు .
రెస్ట్ ఆఫ్ ఇండియా : 2.0 కోట్లు .
ఓవర్సిస్ : 7.0 కోట్లు .
పి & డి : 3.5 కోట్లు .
ప్రపంచవ్యాప్తంగా ఎఫ్ 3 సినిమాకు 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: