దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ,జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా మార్చి 25 వ తేదీన విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉండటంతో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఫ్రీ రిలీజ్  జరిగింది. అందులో భాగంగా ఈ సినిమాకు కర్ణాటక ఏరియాలో కూడా అదిరిపోయే ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.  కర్ణాటక ఏరియా లో 'ఆర్ ఆర్ ఆర్' మూవీ కి 41 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.

42 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ కి కర్ణాటక ఏరియా లో భారీ అంచనాలు ఉన్నప్పటికీ రిలీజ్ సమయం లో థియేటర్స్ విషయంలో కర్ణాటకలో కొన్ని గొడవలు జరగడంతో ఓపెనింగ్స్ పై వాటి ప్రభావం చూపినప్పటికీ లాంగ్ రన్ లో మాత్రం 'ఆర్ ఆర్ ఆర్' మూవీ కర్ణాటక ఏరియా లో అదిరిపోయే కలెక్షన్లను వసూలు చేసింది. 41 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న 'ఆర్ ఆర్ ఆర్' మూవీ బాక్సాఫీస్ హోటల్ రన్ ముగించుకునే సరికి 44.50 కోట్ల షేర్ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర వసూలు చేసినట్లు తెలుస్తోంది. 

అలాగే 83.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఓవరాల్ ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర కర్ణాటక ఏరియాల్లో క్లీన్ హిట్ గా నిలిచింది. 42 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన ఆర్ ఆర్ ఆర్ మూవీ ఫైనల్ రన్ ముగిసే సరికి 2.50 కోట్ల మేర లాభాలను అందుకని కర్ణాటక ఏరియా లో క్లీన్ హిట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: