కేవలం నెలరోజుల గ్యాప్ లో రామ్ చరణ్ తేజ్ నటించిన ఆర్ఆర్ఆర్ మరియు ఆచార్య సినిమాలు విడుదలయ్యాయి. ఆర్ఆర్ఆర్ ఇండస్ట్రీ హిట్ గా నిలిస్తే ఆచార్య సినిమా మాత్రం ఫ్లాప్ గా నిలిచింది.


చిరంజీవి, చరణ్ కలిసి నటించిన ఆచార్య అలాంటి ఫలితాన్ని అందుకుంటుందని మెగా అభిమానులు కూడా అస్సలు ఊహించలేదు. అయితే మెగా అభిమానుల మధ్య చీలిక రావడం కూడా ఆచార్య ఫ్లాప్ కు ఒక ముఖ్య కారణమని తెలుస్తోంది. తాజాగా విజయవాడలో మెగా అభిమానులు సమావేశమైన విషయం తెలిసిందే.


ఈ సమావేశంలో మెగా హీరోల సినిమాలు, వాటి ఫలితాలు పవన్ జనసేన పార్టీ గురించి జోరుగా చర్చ జరిగిందని తెలుస్తుంది.. మెగా ఫ్యాన్స్ అంతా కలిసికట్టుగా ఇకపై ముందడుగులు వేయాలని ఫ్యాన్స్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం.. ఈ నిర్ణయం వల్ల మెగా హీరోల సినిమాలకు కచ్చితంగా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఆచార్య సినిమా విషయంలో ఫ్యాన్స్ వైపు నుంచి జరిగిన పొరపాటు మళ్లీ పునరావృతం కాకుండా ఫ్యాన్స్ జాగ్రత్త పడుతున్నారట..


 


ప్రస్తుతం మెగా హీరోలు వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. చరణ్ శంకర్ కాంబో మూవీ 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందట.పవన్ హరిహర వీరమల్లు కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కుతోందని సమాచారం.వరుణ్ తేజ్ ఎఫ్3, గాడ్ ఫాదర్ సినిమాలపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయని తెలుస్తుంది.. మెగా హీరోలు బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ కూడా ఆశిస్తున్నారు.


 


వైష్ణవ్ తేజ్, సాయితేజ్ కూడా పలు ప్రాజెక్ట్ లతో బాగా బిజీగా ఉన్నారు. రాబోయే 12 నెలల్లో మెగా హీరోల నుంచి 4 లేదా 5 సినిమాలు విడుదలయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ సినిమాలపై బాగానే అంచనాలు నెలకొనగా ఈ సినిమాల కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చిరంజీవి ఎక్కువగా రీమేక్ సినిమాలలో నటిస్తుండటం విశేషం.



మరింత సమాచారం తెలుసుకోండి: