టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ ను చూపిస్తున్నాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు ఆయన పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైగర్ సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల కాకముందే విజయ్ దేవరకొండ , శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఖుషి సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది.  ఇది ఇలా ఉంటే ఖుషి మూవీ ఫస్ట్ షెడ్యూల్ ను చిత్ర బృందం కాశ్మీర్ లో ప్లాన్ చేసింది.  తాజాగా చిత్ర బృందం ప్లాన్ చేసిన కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి అయ్యింది.  తర్వాత షెడ్యూల్ హైదరాబాద్ లో తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మిస్తుండగా,  ఈ మూవీ కి హీషమ్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.  ఖుషి మూవీ ని 23 డిసెంబర్ 2022 వ తేదీన తెలుగు, తమిళ ,మలయాళ,  కన్నడ భాషల్లో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించింది.  ఇది ఇలా ఉంటే విజయ్ దేవరకొండ ఈ సినిమాతో పాటు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో జనగణమన సినిమాలో నటించడానికి కూడా ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇలా విజయ్ దేవరకొండ ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను లైన్ లో పెడుతూ ఫుల్ జోష్ చూపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: