టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయిన కార్తికేయ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఎక్స్ 100 మూవీ తో హీరో గా ఎంట్రీ ఇచ్చిన కార్తికేయ మొదటి సినిమా తోనే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకోవడం తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ దక్కించుకున్నాడు.

మూవీ లో కార్తికేయ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటించింది.  ఆర్ ఎక్స్ 100 మూవీ తర్వాత కార్తికేయ అనేక మూవీ లలో హీరోగా నటించినప్పటికీ ఆర్ ఎక్స్ 100 మూవీ రేంజ్ విజయం మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటి వరకు కార్తికేయ లభించలేదు.  హీరో గా నటిస్తూనే కార్తికేయ విలన్ పాత్రలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు . ఇప్పటికే కార్తికేయ , నాచురల్ స్టార్ నాని హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా తెరకెక్కిన తెరకెక్కిన నానిస్ గ్యాంగ్ లీడర్ మూవీ లో విలన్ పాత్రలో నటించాడు.  

అలాగే కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన వలిమై మూవీ లో కూడా విలన్ పాత్రలో నటించి కార్తికేయ ప్రేక్షకులను మెప్పించాడు.  ఇది ఇలా ఉంటే తాజాగా కార్తికేయ బాలీవుడ్ ఇండస్ట్రీ పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది.  అందులో భాగంగా కార్తికేయ ప్రస్తుతం నటిస్తున్న మూవీ లతో పాటు,  గతంలో నటించిన మూవీ లను  కూడా హిందీ లో డబ్ చేసి విడుదల చేయాలనే ఉద్దేశం లో ఉన్నట్లు తెలుస్తోంది.  ఇలా కార్తికేయ తన ప్రస్తుతం నటిస్తున్న మూవీ ల ద్వారా , గతంలో నటించిన మూవీ ల  ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులను అలరించడానికి డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: