తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎంతో మంది కమెడియన్లు ఉన్నారు. ఇక అలాంటి వారిలో కొంత మందికి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. ఇలా ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న వాళ్లలో తాగుబోతు రమేష్ కూడా ఒకరు. నిజజీవితంలో అస్సలు తాగడం అలవాటు లేని రమేష్ సినిమా లో మాత్రం కేవలం తాగుబోతు పాత్రలో మాత్రమే చేసేవాడు. తాగుబోతు పాత్ర లలో రమేష్ తప్ప ఇంకెవరూ కూడా అలా చేయలేరు అనేంతగా ప్రేక్షకులను అలరించాడు. ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో ఏ సినిమాలో చూసినా తాగుబోతు రమేష్  కోసం ఒక ప్రత్యేకమైన పాత్ర ఉండేది అని చెప్పాలి.


 కాని గత కొంత కాలంగా మాత్రం తాగుబోతు రమేష్ కి సరైన అవకాశాలు రావడం లేదన్న విషయం తెలిసిందే. ఇలా అవకాశాలు వచ్చినా అటు తాగు బోతు పాత్రలు చేయడం లేదు. ఆడపదడప అవకాశాలు మాత్రమే అందుకుంటున్న తాగుబోతు రమేష్ ఇటీవలికాలంలో అటు జబర్దస్త్ లో మాత్రం అదరగొడుతున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే తాగుబోతు రమేష్ కి అసలు సిసలైన తాగుబోతు పాత్ర ఎప్పుడు వస్తుందా అనిఅభిమానులు అందరూ ఎదురుచూస్తున్నారు.


 ఇటీవలే విడుదలైన శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రోమో లో భాగంగా తాగుబోతు రమేష్ మరోసారి అదరగొట్టేసాడు. సినిమాల్లో చేసిన దానికంటే ఇక ఈ ప్రోమో లో మాత్రం అద్భుతమైన ఫర్ఫార్మెన్స్ చేశాడు. ఇది చూసిన తర్వాత అభిమానులు అందరూ కూడా ఎంతగానో మురిసిపోతున్నారు అనే చెప్పాలి. ఎన్నాళ్ళకు ఎన్నాళ్ళకు తాగుబోతు రమేష్ నుంచి ఇలాంటి పర్ఫామెన్స్ చూసాము అంటూ కామెంట్ చేస్తూ ఉన్నారు అభిమానులు. ఏదేమైనా తాగుబోతు  పాత్రలు చేయాలంటే కేవలం రమేష్ తర్వాతే ఇంకెవరైనా అంటూ ప్రశంసిస్తూ  ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో చూసేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: