ప్రస్తుతం ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్ర పరిశ్రమ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన విజయ్ దేవరకొండ మొదటి సినిమా పెళ్లి చూపులు తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాకు తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించాడు అన్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు అని చెప్పడం లో అతిశయోక్తి లేదు. ఈ క్రమం లోనే  ఇక విజయ్ దేవరకొండ కెరీర్ ప్రస్తుతం సక్సెస్ ఫుల్ గా ఉండటమే కాదు స్టార్ హీరోగా ఎదిగాడు రౌడీ హీరో.


 పూరి జగన్నాథ్ దర్శకత్వం లో భారీ అంచనాల మధ్య బాక్సింగ్ నేపథ్యం లో తెరకెక్కుతున్న l సినిమా లైగర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అయితే విజయ్ దేవరకొండ పెళ్లి చూపులు తర్వాత మరో  సారి తరుణ్ భాస్కర్ తో ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. ఈ క్రమం లోనే  తరుణ్ భాస్కర్ తో విజయ్ దేవరకొండ త్వరలో సినిమా చేయ బోతున్నాడు అంటూ గత కొన్ని రోజుల నుండి టాక్ వినిపిస్తోంది అన్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆలీతో సరదాగా అనే కార్యక్రమం లో పాల్గొన్నాడు దర్శకుడు తరుణ్ భాస్కర్.


 ఈ సందర్భం గా తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. ఇటీవలే విడుదలైన ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోయింది. ఈ క్రమం లో భాగంగా అటు దేవరకొండ తో మరోసారి సినిమా ఎప్పుడు చేయబోతున్నావ్ అంటూ అడుగగా.. వరుసగా మూడు ఫ్లాపులు వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండ సినిమా చేయబోతున్నా అంట తెలిపాడు.  విజయ్ కీ ప్లాపుల అంటూ అలీ పంచ్ వేయగా.. కాదు నాకు ఫ్లాప్ వచ్చిన తర్వాత విజయ్ దేవరకొండను వైల్డ్ కార్డుగా వాడతాను అంటూ తెలిపాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: