తెలుగు చిత్ర పరిశ్రమ లో ఎంతో మంది హీరోలు ఉన్నా అటు రౌడీ హీరో విజయ్ దేవరకొండ కి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు ఉంది అన్న విషయం తెలిసిందే. ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఎన్నో కష్టాలు పడి హీరోగా ఎదిగిన విజయ్ దేవరకొండ   ఇప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరో గా కొనసాగుతున్నాడు. ఇక అంచలంచలుగా ఎదుగుతూ ఇక ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు అన్న విషయం తెలిసిందే.


 అయితే విజయ్ దేవరకొండ సినిమా లలో మాత్రమే కాదు అతని ఆటిట్యూడ్తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లు సైతం విజయ్ దేవరకొండ సినిమాతో ఒక్క సినిమా చేసినా చాలు అని కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. విజయ్ దేవరకొండ ఎంత ధైర్య వంతుడు అన్న విషయాన్ని ఇటీవలే అతని స్నేహితుడు తరుణ్ భాస్కరు ఓ కార్యక్రమం లో చెప్పుకొచ్చాడు. విజయ్ దేవరకొండ చావు ఎదురుగా ఉన్న భయపడలేదు అంటూ చెప్పుకొచ్చాడు. విజయ్ దేవరకొండ తరుణ్ భాస్కర్ కాంబినేషన్లో పెళ్లిచూపులు సినిమా వచ్చింది. ఇక సినిమా లో ఫుడ్ ట్రక్  నడుపుతున్న యువకుడిగా కనిపిస్తాడు విజయ్ దేవరకొండ. అయితే ఒకసారి షూటింగ్ చేస్తున్న సమయం లో ఒక్క సారిగా ట్రక్ బ్రేకులు ఫెయిల్ అయ్యాయి అని హ్యాండ్ బ్రేక్ కూడా ఊడి చేతి లోకి వచ్చిందని చెప్పుకొచ్చాడు. ఇక ఆ సమయం లో కొంత సేపు కంగారు పడిన విజయ్ ఆ తర్వాత మాత్రం హాయిగా కూర్చుని ఇక కొంత దూరం వెళ్లి ఆగిన తర్వాత.. ఎందుకు విజయ్ టెన్షన్ పడలేదు అని అడిగితే అందరూ ఇందులోనే ఉన్నారూ. చస్తే  అందరం కలిసి చస్తాం అంటూ షాకింగ్ సమాధానం చెప్పాడు అంటూ తరుణ్ భాస్కర్ చెప్పుకొచ్చాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: