ప్రస్తుతం టాలీవుడ్ లో కొనసాగుతున్న సీనియర్ స్టార్ హీరోయిన్లలో తమన్నా కూడా ఒకరు. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన హ్యాపీడేస్ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన ఈ మిల్కీ బ్యూటీ టాప్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు పొందింది.


తెలుగు మాత్రమే కాకుండా తమిళ, హిందీ భాషలలో పలు సినిమాలలో నటించి అక్కడ కూడా మంచి గుర్తింపునే పొందింది.అయితే ఈ మధ్య హీరోయిన్ గా ఈ అమ్మడికి అవకాశాలు అయితే తగ్గాయి. అయినప్పటికీ వెబ్ సిరీస్ లో నటిస్తూ డిజిటల్ స్క్రీన్ మీద కూడా తన సత్తాను చాటుతోంది.


హీరోయిన్ గా మాత్రమే కాకుండా కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్స్ కూడా ఆమె చేసింది. మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ.. వరుణ్ తేజ్ హీరోగా ఇటీవల విడుదలైన గణేష్ సినిమాలో కూడా ఒక స్పెషల్ సాంగ్ ను చేసింది. అయితే హీరోయిన్ గా తమన్నాకు అవకాశాలు తగ్గడానికి కారణం కొన్ని సినిమాలో నటించడమే అని ఆమె తెలియజేసిందట.. ఆ సినిమాలలో నటించడం వల్ల టాప్ హీరోయిన్ గా కొనసాగాల్సిన ఈ మిల్కీ బ్యూటీ ప్రస్తుతం అవకాశాలు తగ్గి చాలా ఇబ్బంది పడుతోంది.


  టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలో తమన్నా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిందట.. తమన్నా అజయ్ దేవగన్ తో కలిసి హిమ్మత్వాలా అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఆ సినిమాపై బోలెలు ఆశలు పెట్టుకుంది . కానీ ఈ సినిమా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది. దీంతో ఆమెకి బాలీవుడ్ లో మంచి అవకాశాలు లేక నిలదొక్కుకోలేక పోయిందట.. ఇలా ఈ సినిమాలో చేయకపోతే ఉంటే తన కెరియర్ మరోలా ఉండేదనిఆమె తెలియజేశారు. ప్రస్తుతం ఈ బ్యూటీ f3 సినిమా ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు తమన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి: