విభిన్నమైన చిత్రాలతో తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటూ తన సత్తా చూపిస్తూ ఉంటాడు యంగ్ హీరో కార్తీ. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ఉన్నారు. ఇందులో ఒకటి "సర్దార్" పేరుతో రూపొందిస్తూ ఉండగా మరొకటి "వీరు మన్"గా తెరకెక్కిస్తున్నారు ఈ చిత్రాన్ని హీరో జ్యోతిగా టుడే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నది. ముత్తయ్య డైరెక్టర్గా చేస్తున్నారు ఈ మూవీ ద్వారా ది గ్రేట్ డైరెక్టర్ శంకర్ కూతురు "అతిథి శంకర్" హీరోయిన్ గా పరిచయం కాబోతోంది.

ఇక షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చాలా శరవేగంగా జరుపుకుంటున్నాయి. ఆగస్టు 31న ఈ సినిమా విడుదల చేయబోతున్నట్లు గా ఇటీవల ప్రకటించిన హీరో కార్తీ అదే తరహాలో నటిస్తున్న సర్దార్ చిత్రాన్ని కూడా విడుదల చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని మిత్రన్ డైరెక్ట చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా రాశి ఖన్నా, జై భీమ్ ఫేమ్ రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఇందులో కీలక పాత్ర లో అలనాటి హీరోయిన్ లైలా కూడా నటించబోతోంది.

పదహారేళ్ల విరామం తర్వాత లైలా నటిస్తున్న చిత్రం ఇది అని చెప్పవచ్చు ఇందులో కార్తీ రెండు పాత్రల్లో కనిపించబోతున్నారు.. కార్తీక్ తండ్రి కొడుకులు కనిపించబోతున్నట్లు గా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన లుక్ ని విడుదల చేసి మేకర్ హైప్ ను పెంచారు. ఇక తాజాగా ఈ రోజున ఈ సినిమాకు సంబంధించి మరొక పోస్టర్ కూడా విడుదల చేశారు ఆ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. సర్దార్ నుండి సెకండ్ లుక్ ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉందని కార్తి అభిమానులు తెలియజేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో కూడా కార్తీక్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు ఈ సినిమా దీపావళికి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: