మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ మధ్య ఆర్ఆర్ఆర్ సినిమా తో ప్రెక్షకులను పలకరించాడు... ఆ సినిమా పాన్ ఇండియా మూవీగా విడుదల అయ్యి భారీ కలెక్షన్స్ అందుకోవడం తో పాటు, భారీ హిట్ ను కూడా అందుకుంది రాజమౌలి నుంచి వచ్చిన సినిమాలు అన్నీ కూడా ఇలానే టాక్ ను అందుకుంటాయి అనడంలో నో డౌట్ అనే ఈ సినిమా నిరూపించింది..ఆ సినిమా సక్సెస్ తో రామ్ చరణ్ మరింత జొరును పెంచారు..ఇప్పుడు ఖాళీ లేకుండా సినిమాలను చేస్తున్నాడు. తాజాగా రిలీజ్ అయిన ఆచార్య సినిమా లో నటించారు. కానీ, ఆ సినిమా అంత హిట్ టాక్ ను అందుకోలేదు.


ఇప్పుడు మరో సినిమాలో డైరెక్టర్ శంకర్ సినిమాలో నటిస్తున్నాడు..చరణ్ తన కెరీర్‌లోని 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాను మరోసారి శంకర్ మార్క్ మూవీగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.ఇది ఇలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త అభిమానులను కలవర పెడుతోంది.

 

శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న మూవీని తొలుత సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. అందుకు తగ్గట్టుగానే సినిమా షూటింగ్‌ను కూడా శరవేగంగా జరుపుతూ స్పీడు మీదున్నారు.సినిమా రిలీజ్‌ను వేసవి 2023కి మార్చాలని చిత్ర యూనిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా డెవలెప్‌మెంట్స్‌ను బట్టి ఈ విషయంపై నిర్ణయం తీసుకోబోతున్నట్లు చిత్ర వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి అఫీషిల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో అరవింద్ స్వామి, ఎస్.జె.సూర్య, సురేష్ గోపీ, ఈషా గుప్తా, అంజలి, శ్రీకాంత్, సునీల్ తదితరులు నటిస్తున్నారు.. ఈ సినిమా వల్ల నెక్స్ట్ మూవికి ఆలస్యం అవుతూందని సినీ వర్గాల్లో వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: