ఆమె అలా కనిపిస్తే చాలు అందరి మనసుకు రెక్కెలొచ్చేస్తాయి.. లోపలున్న కవి సార్వభౌముడు కూడా నిద్ర లేస్తాడు. ''నిను చూస్తూ మైమరిచి నాలో నేను మురిసిపోతున్నా..


నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఆదమరుస్తున్నా.. నీ రూపాన్ని ఊపిరిలా నాలో నింపుకుంటున్నా'' అంటూ కవితా ప్రవాహాన్ని అయితే వదులుతాడు. ఎందుకంటే.. ఆమెను చూస్తుంటే ప్రపంచంలోని అందమంతా వచ్చి కంటి ముందు సాక్షాత్కరమయిందా అన్నట్లు అనిపిస్తుంది కాబట్టి. ఇప్పటికే మీకు అర్థం అయ్యే ఉంటుంది ఎవరి గురించి ఇలా చెబుతున్నామో. 48 ఏళ్ల వయసులోనూ వన్నె తగ్గని అందంతో సినిమాలు, అంతర్జాతీయ ఈవెంట్స్ లో మెరుస్తు మురిపిస్తున్న ఐశ్వర్య రాయ్.


తాజాగా 75వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో తళుక్కున మెరిసింది క్యూట్ బ్యూటీ ఐశ్వర్య.. గత 21 సంవత్సరాలుగా ఇలాంటి అంతర్జాతీయ ఈవెంట్స్ లో పాల్గొంటూనే వస్తోంది. వెండితెరపై వెన్నెల కురిపించే ఆ అందంపై తాజాగా సోషల్ మీడియాలో ఓ ఆసక్తికర చర్చ జరుగుతోందట.. దానికి కారణం లేకపోలేదు. సినిమాల్లోకి రాకముందు అప్పుడప్పుడే మోడల్ గా ఎదుగుతున్న సమయంలో ఐశ్వర్యకు సంబంధించిన ఓ అగ్రిమెంట్ కాపీ ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.


 


1994లో మిస్ వరల్డ్ అయిన ఐశ్వర్య అంతకంటే ముందే మోడలింగ్ చేసేదట. అలా ఆమె పాల్గొన్న ఒక మ్యాగజైన్ తాలూకూ ఫోటోషూట్ 1992లో జరిగిందని సమాచారం.అంటే.. అప్పటికి ఐష్ వయసు 18 ఏళ్లు. సాదాసీదా అప్ కమింగ్ మోడల్ గా కృపా క్రియేషన్స్ అనే సంస్థ కోసం ఆమె కెమెరా ముందుకొచ్చిందట. సల్వార్ కమీజ్ ను ధరించి ఫోజులిచ్చింది. అయితే, సదరు ఫ్యాషన్ క్యాటలాగ్ కోసం ఐశ్వర్య అందుకున్న ఫీజు తెలిస్తే అందరూ షాకవ్వాల్సిందే. అక్షరాలా 15 వందల రూపాయలట.


 


ఐష్ కు 15 వందల రూపాయలను చెక్కు ద్వారా చెల్లించిందట సదరు సంస్థ. ఈ విషయం కూడా స్పష్టం చేస్తూ బిల్ పైన సంతకం కూడా చేసింది ఐష్. ప్రస్తుతం దీనికి సంబంధించిన అగ్రిమెంట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: