సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత మహేష్ బాబు నటించిన చిత్రం సర్కారు వారి పాట. 'గీత గోవిందం'ఫేమ్‌ పరశురామ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.


రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం మే 12 ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుత విజయం సాధించింది. తొలి రోజు నుంచే పాజిటివ్‌ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ చిత్రం.. బాక్సాపీస్‌ వద్ద రికార్డుల చరిత్ర సృష్టిస్తోంది.


సినిమా కథ విషయానికి వస్తే.. భారత బ్యాంకింగ్ రంగంలో వేల కోట్లు ఎగవేసిన ఓ రాజకీయ నేతలు, బడా బాబులపై తెరకెక్కించారట.. ఈ సినిమా డిజిటల్ రైట్స్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుందని సమాచారం.. శాటిలైట్ హక్కులను స్టార్ మా దక్కించుకున్నట్టు తెలుస్తుంది.అయితే మూవీ బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతూ బాగా దూసుకుపోతుంది.


ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయం సాధించడం పట్ల హీరో మహేష్ బాబు సంతోషం వ్యక్తం చేస్తూ, సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి మరియు టీమ్ కి స్పెషల్ థాంక్స్ తెలిపారు. మహేష్ కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. సర్కారు వారి పాట పై చూపిస్తున్న ప్రేమ కి, ఫ్యాన్స్ చూపిస్తున్న ప్రేమ కి థాంక్స్, సర్కారు వారి పాట టీమ్ కి బిగ్ థాంక్స్ అని 


అంతేకాక అమేజింగ్ ఫిల్మ్ ఇచ్చిన డైరెక్టర్ పరశురామ్ కి, హీరోయిన్ కీర్తి సురేష్, నిర్మాతలకు, ఇన్ క్రెడిబుల్ మ్యూజిక్ ఇచ్చిన థమన్ కి థాంక్స్ అంటూ చెప్పుకొచ్చారట. మహేష్ బాబు సోషల్ మీడియా వేదిక గా చేసిన పోస్ట్ వైరల్ గా మారుతోంది. రీసెంట్‌గా జరిగిన సర్కారు వారి పాట సక్సెస్ మీట్ ఫంక్షన్ లోను మహేష్ ఎమోషనల్‌గా మాట్లాడిన సంగతి తెలిసిందే.


 

సర్కారు వారి పాట చిత్రం కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.160.2 కోట్ల గ్రాస్‌, రూ. 100.44 కోట్ల షేర్‌ని సాధించి, రికార్డు క్రియేట్‌ చేసిందట.ఐదు రోజుల్లో రూ.100కోట్ల షేర్‌ సాధించిన తొలి ప్రాంతీయ చిత్రంగా నిలిచింది.. నైజాం ఏరియాల్లో ఈ చిత్రం 31.47 కోట్ల వసూళ్లను అయితే రాబట్టింది. నైజాంలో 30కోట్లకు పైగా వసూళ్ల సాధించిన మూడో చిత్రంగా నిలిచింది.. ఈ చిత్రానికి దాదాపు రూ.120 కోట్ల ప్రీరిలీజ్‌ బిజినెస్‌ అయితే జరిగింది. బ్రేక్‌ ఈవెన్‌ సాధించాలంటే.. మరో 20 కోట్ల రూపాయలను వసూలు చేయాల్సి ఉందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: