ఉగ్రం, కేజీఎఫ్, కేజీఎఫ్2 సినిమాలతో ప్రశాంత్ నీల్ బాక్సాఫీస్ వద్ద అద్భుత విజయాలను సొంతం చేసుకున్నారు. అయితే ప్రశాంత్ నీల్ సలార్ సినిమాను, ఎన్టీఆర్31 సినిమాను డార్క్ షేడ్ లో తెరకెక్కించనుండటంతో కొంతమంది నుంచి నెగిటివ్ కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి


ప్రశాంత్ నీల్ ఒకే జానర్ లో సినిమాలను తెరకెక్కిస్తున్నారని ఇలా చేయడం వల్ల ఆయన కెరీర్ పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారట.అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే సినిమాలపై ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టాలని


ఫ్యామిలీ ఆడియన్స్ ను కూడా మైండ్ లో పెట్టుకుని ప్రశాంత్ నీల్ సినిమాలను తెరకెక్కిస్తే బాగుంటుందని చాలామంది నెటిజన్ల నుంచి కూడా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ నీల్ ఒకే జానర్ లో సినిమాలను తెరకెక్కిస్తే అదే మ్యాజిక్ ను రిపీట్ చేయడం కూడా సులువు కాదని కామెంట్లు కూడా వ్యక్తమవుతూ ఉండటం విశేషం.ఎంటర్టైన్మెంట్ కు కొంతమేర ప్రాధాన్యత ఉండే కథలపై ప్రశాంత్ నీల్ దృష్టి పెడితే బెటర్ అని కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.


 


వరుసగా సీరియస్ సినిమాలు చేయడం వల్ల ప్రశాంత్ నీల్ సినిమాలకు ఒక వర్గం ప్రేక్షకులు దూరంగా ఉండే అవకాశాలు అయితే ఉంటాయని కేజీఎఫ్ ఛాప్టర్2 సక్సెస్ తో ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ ఊహించని స్థాయిలో పెరిగిందట.. ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ మొత్తం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ తో పాటు సినిమాలకు వస్తున్న లాభాల్లో వాటా కూడా తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.


 


ప్రశాంత్ నీల్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లు సైతం భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్నాయట వచ్చే ఏడాది సమ్మర్ లో సలార్ సినిమా రిలీజ్ కానుందని తెలుస్తుంది.. 350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలు కూడా తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: