సూపర్ స్టార్ మహేష్ హీరోగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. కీర్తి సురేష్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో సముద్రఖని విలన్ గా నటించగా ఇతర పాత్రల్లో సుబ్బరాజు, వెన్నెల కిషోర్, నాగబాబు, బ్రహ్మాజీ తదితరులు నటించారు. మహేష్ బాబు ఒక డిఫరెంట్ రోల్ లో కనిపించిన ఈ సినిమాలో కీర్తి సురేష్ కూడా ఎంతో సరికొత్తగా కనిపించారు.

యువ దర్శకుడు పరశురామ్ పెట్ల దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట అందరి నుండి సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుని మంచి విజయం అందుకుంది. సూపర్ స్టార్ మహేష్ స్టన్నింగ్ పెర్ఫార్మన్స్, యాక్షన్, డైలాగ్స్, ఫైట్స్, విజువల్స్, థమన్ అందించిన సాంగ్స్, బీజీఎమ్ ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. అన్ని వర్గాల ఆడియన్స్ తో పాటు మహేష్ ఫ్యాన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకునేలా సర్కారు వారి పాట మూవీ తీయడంలో దర్శకుడు పరశురామ్ పెట్ల సక్సెస్ అయ్యారు. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 200 కోట్ల కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న సర్కారు వారి పాట మూవీతో మహేష్ బాబు మరొక హ్యాట్రిక్ కి శ్రీకారం చుట్టారు.

ఇటీవల భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు సినిమాలతో మహేష్ హ్యాట్రిక్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం అక్కడక్కడా కొన్ని ప్రాంతాల్లో ఇంకా సర్కారు వారి పాట మూవీ బాగానే కలెక్షన్ సొంతం చేసుకుంటోందని, మరి ఫైనల్ గా ఎంత మేర ఈ మూవీ కలెక్షన్ కొల్లగొడుతుందో తెలియాలి అంటే మరికొన్నాళ్లు వరకు ఆగాల్సిందే అంటున్నారు టాలీవుడ్ విశ్లేషకులు. దీని అనంతరం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన నెక్స్ట్ మూవీ చేయనున్నారు మహేష్ బాబు. మంచి యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ మూవీని హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: