టాలివుడ్ అగ్ర హీరో రవితేజ సినిమా హిట్ తో పని లేకుండా వరుస సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు.. క్రాక్ సినిమా అతనికి ఈ మధ్య కాలంలో మంచి హిట్ ను ఇచ్చినా కూడా ఆ తర్వాత వచ్చిన ఖిలాడి సినిమా అతనికి కొలుకొలేని షాక్ ను ఇచ్చింది. అయిన వెనక్కి తగ్గ కుండా వరుస సినిమాల ను చెస్తున్నారు.. ప్రస్తుతం ఈ హీరో రామారావు ఆన్ డ్యూటీ ఇప్పటికే చివరిదశకు చేరుకుని రిలీజ్‌ కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తో పాటు ధమాకా అనే మరో సినిమా ను కూడా తెరకెక్కిస్తున్నాడు ఈ మాస్ హీరో.
 

అయితే ఈ సినిమాల తో పాటు మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఓ సినిమాలో కీలక పాత్ర లో నటించేందుకు రెడీ అవుతున్నాడు మాస్ రాజా.. ఆ సినిమా ఇంకా సెట్స్ మీదకు వెళ్ళలేదు కానీ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.. ఇది ఇలా ఉండగా.. తాజాగా మరో కొత్త సినిమా కు కూడా రవితేజ పచ్చజెండా ఊపినట్లుగా తెలుస్తోంది. సూర్య వర్సెస్ సూర్య అనే సినిమాతో దర్శకుడిగా మారిన ప్రముఖ సినిమాటో గ్రఫర్ కార్తీక్ ఘట్టమనేని రవితేజ కు ఓ కథను వినిపించాడట.ఆ సినిమాకు రవితేజ ఓకే చెప్పడంతో త్వరలోనే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో సినిమా పట్టాలెక్కనున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.అయితే ఈ సినిమా కథను ఇంకా పూర్తిగా డెవలప్ చేయాలని రవితేజ సూచించాడట.. మొత్తంగా చూసుకుంటే రవి తేజ సినిమాల ను చేసుకుంటూ వస్తున్నాడు.. వరుస బెట్టి చేస్తున్న సినిమాలు మాస్ ప్రేక్షకుల కు కిక్ ను ఇస్తున్నాయి.పాత-కొత్త అనే తేడాలేకుండా డైరెక్టర్ల కు అవకాశాలు ఇస్తూ దూసుకు పోతున్నాడు. మరి కార్తీక్ ఘట్టమనేని చెప్పిన కథ రవితేజకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: